ప్రభన్యూస్

Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫెడరేషన్ నుంచి షోకాజ్ నోటీస్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Jani Master) తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) భారీ షాకిచ్చింది. ఫెడరేషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

News18
News18

టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Jani Master) తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) భారీ షాకిచ్చింది. తనదైన స్టెప్పులతో స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయనపై ఫెడరేషన్ కఠిన చర్యలకు పాల్పడింది. ఫెడరేషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా, ఆయనపై తక్షణమే “సహాయ నిరాకరణ” (Non-Cooperation) విధిస్తున్నట్లు ఫెడరేషన్ ప్రకటించడం చిత్రసీమలో తీవ్ర సంచలనంగా మారింది.

వివాదానికి అసలు కారణం ఏంటి?

ఈ నెల 12న జానీ మాస్టర్ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో ఈ మొత్తం వివాదానికి దారి తీసింది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట ఆయన చేసిన వ్యాఖ్యలు ఫెడరేషన్ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని, సభ్యులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఆయన ప్రవర్తించారని ఫెడరేషన్ భావించింది. దీనికి తోడు డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఫెడరేషన్‌ను పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై వివరణ కోరేందుకు ఈ నెల 14న జానీ మాస్టర్‌ను ఆఫీస్ సమావేశానికి పిలవగా, ఆయన విచారణకు హాజరుకాకపోగా తన ఇష్టానుసారం వ్యాఖ్యలు కొనసాగించారని ఫెడరేషన్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఇండస్ట్రీలోని పెద్దలు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది.

సహాయ నిరాకరణ.. 24 క్రాఫ్ట్స్ దూరం:

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్.. ఈ నెల 16న అత్యవసరంగా సమావేశమైంది. జానీ మాస్టర్ ప్రవర్తనను తీవ్ర క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణించి, ఆయనపై సహాయ నిరాకరణ చర్యలు ప్రారంభించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం 17న మధ్యాహ్నం మరోసారి సమావేశమై ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఖరారు చేసింది. ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా.. చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ యూనియన్లకు చెందిన ఏ కార్మికుడు కూడా ఇకపై జానీ మాస్టర్‌తో పాటు తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సహకరించకూడదు. అంటే లైట్‌మెన్, ప్రొడక్షన్ బాయ్స్, మేకప్ ఆర్టిస్టులు, కెమెరా అసిస్టెంట్స్.. ఇలా ఏ ఒక్కరూ ఆయన సెట్స్‌లో పనిచేయరు. దీనివల్ల ఆయన కొరియోగ్రఫీ చేసే షూటింగులు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది.

7 రోజుల డెడ్‌లైన్.. క్షమాపణలు చెప్పాల్సిందే!

షోకాజ్ నోటీసు అందిన 7 రోజుల్లోగా జానీ మాస్టర్ లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఫెడరేషన్ స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోయినా, లేదా బహిరంగంగా క్షమాపణ చెప్పకపోయినా ఆయనపై శాశ్వత నిషేధం వంటి మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. రాబోయే ఆదివారం జరగనున్న జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. చేతినిండా భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్న జానీ మాస్టర్ పై ఈ నిషేధం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, ఈ నోటీసులపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 8:03 am Digital Edition : Prabhanews
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫెడరేషన్ నుంచి షోకాజ్ నోటీస్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 18, 2026 7:39 AM ISTప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Jani Master) తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) భారీ షాకిచ్చింది. ఫెడరేషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
News18టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు (Jani Master) తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) భారీ షాకిచ్చింది. తనదైన స్టెప్పులతో స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయనపై ఫెడరేషన్ కఠిన చర్యలకు పాల్పడింది. ఫెడరేషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు, యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా, ఆయనపై తక్షణమే "సహాయ నిరాకరణ" (Non-Cooperation) విధిస్తున్నట్లు ఫెడరేషన్ ప్రకటించడం చిత్రసీమలో తీవ్ర సంచలనంగా మారింది.వివాదానికి అసలు కారణం ఏంటి?ఈ నెల 12న జానీ మాస్టర్ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో ఈ మొత్తం వివాదానికి దారి తీసింది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట ఆయన చేసిన వ్యాఖ్యలు ఫెడరేషన్ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని, సభ్యులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఆయన ప్రవర్తించారని ఫెడరేషన్ భావించింది. దీనికి తోడు డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఫెడరేషన్‌ను పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై వివరణ కోరేందుకు ఈ నెల 14న జానీ మాస్టర్‌ను ఆఫీస్ సమావేశానికి పిలవగా, ఆయన విచారణకు హాజరుకాకపోగా తన ఇష్టానుసారం వ్యాఖ్యలు కొనసాగించారని ఫెడరేషన్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఇండస్ట్రీలోని పెద్దలు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది.సహాయ నిరాకరణ.. 24 క్రాఫ్ట్స్ దూరం:ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్.. ఈ నెల 16న అత్యవసరంగా సమావేశమైంది. జానీ మాస్టర్ ప్రవర్తనను తీవ్ర క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణించి, ఆయనపై సహాయ నిరాకరణ చర్యలు ప్రారంభించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం 17న మధ్యాహ్నం మరోసారి సమావేశమై ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఖరారు చేసింది. ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా.. చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ యూనియన్లకు చెందిన ఏ కార్మికుడు కూడా ఇకపై జానీ మాస్టర్‌తో పాటు తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సహకరించకూడదు. అంటే లైట్‌మెన్, ప్రొడక్షన్ బాయ్స్, మేకప్ ఆర్టిస్టులు, కెమెరా అసిస్టెంట్స్.. ఇలా ఏ ఒక్కరూ ఆయన సెట్స్‌లో పనిచేయరు. దీనివల్ల ఆయన కొరియోగ్రఫీ చేసే షూటింగులు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది.7 రోజుల డెడ్‌లైన్.. క్షమాపణలు చెప్పాల్సిందే!షోకాజ్ నోటీసు అందిన 7 రోజుల్లోగా జానీ మాస్టర్ లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఫెడరేషన్ స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోయినా, లేదా బహిరంగంగా క్షమాపణ చెప్పకపోయినా ఆయనపై శాశ్వత నిషేధం వంటి మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. రాబోయే ఆదివారం జరగనున్న జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. చేతినిండా భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్న జానీ మాస్టర్ పై ఈ నిషేధం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, ఈ నోటీసులపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link