వైద్యులు ఏం చెబుతున్నారు?
వైద్యుల అభిప్రాయం ప్రకారం, ముఖ్యంగా రాత్రిపూట గుండెల్లో మంట, అసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఎడమవైపు తిరిగి పడుకోవడం ఉపయోగపడవచ్చు. డాక్టర్ కునాల్ సూద్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో నిద్ర, నిద్ర నాణ్యతను ప్రభావితం చేసే అంశాల గురించి వివరించారు. అయితే పడుకునే విధానంతో పాటు, రాత్రి తీసుకునే ఆహారం, భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోవడం వంటి అలవాట్లు కూడా నిద్రపై ప్రభావం చూపుతాయి.

