Last Updated:
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ‘కాకా’. తాజాగా సెట్స్ నుంచి లీక్ అయిన వీడియో వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ‘కాకా’పై ప్రేక్షకుల్లో ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ ఈ సినిమాపై భారీ క్యూరియాసిటీ నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.
సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో ఓ వీడియో నెట్టింట లీక్ కావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ చిన్న క్లిప్‌లో చిరంజీవి గతంలో ఎన్నడూ చూడని విధంగా అత్యంత యంగ్ లుక్ లో, ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. తన పాత బ్లాక్ బస్టర్ చిత్రాలను గుర్తుచేసేలా.. చేతిలో సిగార్ పట్టుకుని ఎంతో స్టైలిష్‌గా నడుస్తూ ప్రముఖ నటుడు మురళీధర్ గౌడ్‌తో మాట్లాడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. వింటేజ్ చిరును తలపిస్తున్న ఈ స్వాగ్, స్టైల్ చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతానికి ఈ వీడియో ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే, నెట్టింట హల్చల్ చేస్తున్న ఈ వీడియో బాబీ దర్శకత్వంలో వస్తున్న ‘కాకా’ సినిమాలోని సన్నివేశమా? లేక మరేదైనా వాణిజ్య ప్రకటన (కమర్షియల్ యాడ్) లేదా వేరే ప్రాజెక్ట్ షూటింగ్‌కు సంబంధించినదా? అన్న దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఒకవేళ ఇది ‘కాకా’ సినిమాలోనిదే అయితే మాత్రం థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Kadiri Kalidas from #KAAKA sets 🔥
@KChiruTweets
#MegastarChiranjeevi https://t.co/RRrMxuvgBv— Megastar Chiranjeevi (@ChiruFanClub) October 19, 2026
కాగా, ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి బరిలోనే నిలిచి భారీ విజయం సాధించిన సెంటిమెంట్‌ను ఈ చిత్రానికి కూడా రిపీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా షూటింగ్ స్పాట్ నుంచి ఇలాంటి కీలకమైన వీడియోలు, లుక్స్ లీక్ కావడం పట్ల చిత్ర యూనిట్ అప్రమత్తమై, సెట్స్‌లో మొబైల్ ఫోన్ల వాడకంపై కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

