టూర్ షెడ్యూల్, విమాన సమయాలు ప్రస్తుతానికి సూచనప్రాయంగా ఇచ్చారు. విమానయాన సంస్థల కార్యకలాపాలు, స్థానిక పరిస్థితులను బట్టి వీటిలో మార్పులు ఉండొచ్చు. కొన్ని ఆలయాల దగ్గరకు పెద్ద బస్సులు వెళ్లడానికి అవకాశం ఉండదు. అలాంటి ప్రాంతాలకు చేరుకోవడానికి స్థానిక రవాణా సౌకర్యాలను ఉపయోగించుకోవాల్సి రావచ్చు. కొన్ని చోట్ల నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన ఆహార అలవాట్లు ఉన్నవారు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ఐఆర్సీటీసీ సూచిస్తోంది. ముఖ్యంగా తమకు అవసరమైన ఆహారం విషయంలో ఇబ్బంది కలగకుండా స్నాక్స్, ప్యాక్డ్ ఫుడ్ వెంట తీసుకెళ్లడం మంచిది. మొత్తంగా చూస్తే, ఆరు రోజుల్లో కోల్కతా చారిత్రక ప్రాంతాలు, ఆలయాలు, సుందర్బన్స్ ప్రకృతి అందాలను చూడాలనుకునేవారికి ఈ ‘బ్యూటిఫుల్ బెంగాల్’ టూర్ ఒక మంచి అవకాశం. అయితే టికెట్ బుక్ చేసుకునే ముందు ప్యాకేజీ ధరలు, అందులో కల్పించే సౌకర్యాలు, అదనంగా చెల్లించాల్సిన ఖర్చులు, ప్రయాణ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్: 9281495845, 9281495843, 9701360701, విజయవాడ: 9281495848, 7670900482, 7670900698, 7670900675, తిరుపతి: 9281030785, 9281030773, 9281030772, విశాఖపట్నం: 9281495837, 9281495847 నెంబర్లను సంప్రదించవచ్చు. లేదా www.irctctourism.com వెబ్సైట్లో వివరాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

