ఈ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ రెండు కేటగిరీల్లో అందిస్తోంది. అవి కంఫర్ట్ (3ఏసీ), స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్). 2026 అక్టోబర్ నుంచి ఈ ధరలు వర్తిస్తాయి. ప్రయాణికుల సంఖ్య, హోటల్ గదిని ఎంతమందితో పంచుకుంటారనే దానిపై టికెట్ ధర మారుతుంది. ఒకరి నుంచి ముగ్గురు వరకు బుకింగ్ చేసుకుంటే కంఫర్ట్ (3ఏసీ) కేటగిరీలో ఒక్కొక్కరికి వర్తించే ధరలు ఇలా ఉన్నాయి. సింగిల్ షేరింగ్‌కు రూ.41,930, ట్విన్ షేరింగ్‌కు రూ.23,910, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.19,240 చెల్లించాలి. బెడ్‌తో పాటు ప్రయాణించే చిన్నారికి రూ.9,810, బెడ్ అవసరం లేని చిన్నారికి రూ.8,600 ధరగా నిర్ణయించారు. స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్) కేటగిరీలో సింగిల్ షేరింగ్‌కు రూ.38,870, ట్విన్ షేరింగ్‌కు రూ.20,850, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.16,180 చెల్లించాలి. బెడ్‌తో వెళ్లే చిన్నారికి రూ.6,750, బెడ్ లేకుండా వెళ్లే చిన్నారికి రూ.5,540 ఖర్చవుతుంది. నలుగురి నుంచి ఆరుగురు వరకు బుకింగ్ చేసుకుంటే ధరలు కొంత భిన్నంగా ఉంటాయి. కంఫర్ట్ (3ఏసీ) కేటగిరీలో ట్విన్ షేరింగ్‌కు ఒక్కొక్కరికి రూ.20,170, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.17,740 చెల్లించాలి. బెడ్‌తో వెళ్లే చిన్నారికి రూ.10,040, బెడ్ లేకుండా వెళ్లే చిన్నారికి రూ.8,830 ధర ఉంటుంది. స్టాండర్డ్ (స్లీపర్ క్లాస్) కేటగిరీలో ట్విన్ షేరింగ్‌కు రూ.17,100, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.16,180 చెల్లించాలి. బెడ్‌తో వెళ్లే చిన్నారికి రూ.6,970, బెడ్ లేకుండా వెళ్లే చిన్నారికి రూ.5,760 ఖర్చవుతుంది. ఈ ధరలు 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు వర్తిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)

