ప్రభన్యూస్

PM Modi: చంద్రబాబుకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. ఏపీలో తుఫాన్ల నష్టంపై ఆరా.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

ఆంధ్రప్రదేశ్‌కు వారం రోజుల వ్యవధిలో రెండు తుఫాన్లు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. విద్యుత్ వ్యవస్థ, రహదారులకు కూడా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఫైల్ ఫొటో (ANI)
ఫైల్ ఫొటో (ANI)

PM Modi calls Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌ను వారం రోజుల వ్యవధిలో రెండు తుఫాన్లు ప్రభావితం చేయడంతో రాష్ట్రంలో పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బుధవారం ఉదయం ఫోన్ చేసి, అర్నబ్, మురసు తుఫాన్ల వల్ల జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు ప్రధానికి వివరించారు. రహదారులు, విద్యుత్ సరఫరా సహా పలు రంగాలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. తుఫాన్ల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ప్రధాని ప్రశంసించారు. నిరంతర అప్రమత్తతతో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్నారని చంద్రబాబును అభినందించారు.

రైతులకు పరిహారం అందించేందుకు సీఎం ప్రయత్నాలు

అర్నబ్, మురసు తుఫాన్ల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. రైతుల సమస్యలను వివరిస్తూ కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇప్పటికే నాలుగుసార్లు చర్చించి, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను వెంటనే రాష్ట్రానికి రప్పించారు. ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడంతోపాటు రైతులకు తాత్కాలిక ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు.

అర్నబ్ తుఫానుతో రూ.4,563 కోట్ల నష్టం

అర్నబ్ తుఫాను కారణంగా రాష్ట్రానికి ప్రాథమికంగా రూ.4,563 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. మొత్తం 16 జిల్లాల్లో 781 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని పేర్కొంది. మూడు లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 13,600 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది. అలాగే 29 వేల విద్యుత్ స్తంభాలు, 7,981 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ధ్వంసమైనట్లు నివేదికలో వివరించింది. ఈ నష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు తక్షణ ఉపశమనంగా రూ.4,563 కోట్లు మంజూరు చేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.

మురసు తుఫానుతోనూ భారీ నష్టం

మురసు తుఫాను ప్రభావంపై కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖలో ఏడు జిల్లాల్లోని 465 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 50,473 హెక్టార్లలో వరి పంట, 1,985 హెక్టార్లలో వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ తుఫాను కారణంగా ప్రాథమికంగా రూ.343 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించారు. బాధిత రైతులకు తక్షణ సాయం అందించాలని కోరారు.

కొలంబో పోర్టులో మిర్చి కంటెయినర్లు

మరోవైపు, శ్రీలంకలోని కొలంబో పోర్టులో నిలిచిపోయిన మిర్చి ఎగుమతుల సమస్యను పరిష్కరించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు చంద్రబాబు లేఖ రాశారు. చైనా, బంగ్లాదేశ్, ఇండోనేసియా, థాయ్‌లాండ్, సింగపూర్ తదితర దేశాలకు వెళ్లాల్సిన 150కి పైగా కంటెయినర్లు అక్కడే నిలిచిపోయాయని వివరించారు. తేమ శాతం పరిమితికి మించి ఉందనే కారణంతో సరకు నిలిపివేశారని, దీంతో రూ.60 కోట్ల విలువైన మిర్చి పోర్టులోనే ఉండిపోయిందని తెలిపారు. ఈ పరిస్థితి రైతులు, ఎగుమతిదారులకు నష్టం కలిగిస్తోందని పేర్కొంటూ, ఆయా దేశాలతో సంప్రదింపులు జరిపి సరకు ఎగుమతికి మార్గం సుగమం చేయాలని కేంద్రాన్ని కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 November 2026, 1:29 pm Digital Edition : Prabhanews
PM Modi: చంద్రబాబుకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. ఏపీలో తుఫాన్ల నష్టంపై ఆరా.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Nov 04, 2026 1:19 PM ISTఆంధ్రప్రదేశ్‌కు వారం రోజుల వ్యవధిలో రెండు తుఫాన్లు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. విద్యుత్ వ్యవస్థ, రహదారులకు కూడా నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఫైల్ ఫొటో (ANI)PM Modi calls Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌ను వారం రోజుల వ్యవధిలో రెండు తుఫాన్లు ప్రభావితం చేయడంతో రాష్ట్రంలో పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బుధవారం ఉదయం ఫోన్ చేసి, అర్నబ్, మురసు తుఫాన్ల వల్ల జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, ఈదురు గాలులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చంద్రబాబు ప్రధానికి వివరించారు. రహదారులు, విద్యుత్ సరఫరా సహా పలు రంగాలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. తుఫాన్ల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ప్రధాని ప్రశంసించారు. నిరంతర అప్రమత్తతతో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్నారని చంద్రబాబును అభినందించారు.రైతులకు పరిహారం అందించేందుకు సీఎం ప్రయత్నాలుఅర్నబ్, మురసు తుఫాన్ల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. రైతుల సమస్యలను వివరిస్తూ కేంద్రానికి లేఖలు రాయడంతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఇప్పటికే నాలుగుసార్లు చర్చించి, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను వెంటనే రాష్ట్రానికి రప్పించారు. ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడంతోపాటు రైతులకు తాత్కాలిక ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు.అర్నబ్ తుఫానుతో రూ.4,563 కోట్ల నష్టంఅర్నబ్ తుఫాను కారణంగా రాష్ట్రానికి ప్రాథమికంగా రూ.4,563 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. మొత్తం 16 జిల్లాల్లో 781 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని పేర్కొంది. మూడు లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 13,600 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది. అలాగే 29 వేల విద్యుత్ స్తంభాలు, 7,981 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ధ్వంసమైనట్లు నివేదికలో వివరించింది. ఈ నష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు తక్షణ ఉపశమనంగా రూ.4,563 కోట్లు మంజూరు చేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.మురసు తుఫానుతోనూ భారీ నష్టంమురసు తుఫాను ప్రభావంపై కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖలో ఏడు జిల్లాల్లోని 465 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 50,473 హెక్టార్లలో వరి పంట, 1,985 హెక్టార్లలో వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఈ తుఫాను కారణంగా ప్రాథమికంగా రూ.343 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించారు. బాధిత రైతులకు తక్షణ సాయం అందించాలని కోరారు.కొలంబో పోర్టులో మిర్చి కంటెయినర్లుమరోవైపు, శ్రీలంకలోని కొలంబో పోర్టులో నిలిచిపోయిన మిర్చి ఎగుమతుల సమస్యను పరిష్కరించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు చంద్రబాబు లేఖ రాశారు. చైనా, బంగ్లాదేశ్, ఇండోనేసియా, థాయ్‌లాండ్, సింగపూర్ తదితర దేశాలకు వెళ్లాల్సిన 150కి పైగా కంటెయినర్లు అక్కడే నిలిచిపోయాయని వివరించారు. తేమ శాతం పరిమితికి మించి ఉందనే కారణంతో సరకు నిలిపివేశారని, దీంతో రూ.60 కోట్ల విలువైన మిర్చి పోర్టులోనే ఉండిపోయిందని తెలిపారు. ఈ పరిస్థితి రైతులు, ఎగుమతిదారులకు నష్టం కలిగిస్తోందని పేర్కొంటూ, ఆయా దేశాలతో సంప్రదింపులు జరిపి సరకు ఎగుమతికి మార్గం సుగమం చేయాలని కేంద్రాన్ని కోరారు.మరింత చదవండి

Source link