వంటగదిలో పాత్రలు కడగడానికి లేదా కొద్దిపాటి వేడి నీటికి వీ-గార్డ్ ఫెరిసియో ఉపయోగపడుతుంది. దీని ధర రూ.3,299. ఇందులో 3,000 వాట్ల రాగి హీటింగ్ ఎలిమెంట్, స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకు ఉన్నాయి. ఇంజినీర్డ్ పాలిమర్ బయటి భాగంతో రూపొందించారు. గరిష్ఠంగా 6 బార్ ఒత్తిడిని తట్టుకోగలదు. థర్మోస్టాట్, థర్మల్ కట్-ఆఫ్, ప్రెజర్ రిలీఫ్ వాల్వ్, యాంటీ సైఫన్ రక్షణతో పాటు, పనిచేసే స్థితిని తెలియజేసే రెండు రంగుల ఎల్ఈడీ సూచికలు ఉన్నాయి. ఉత్పత్తికి రెండేళ్లు, హీటింగ్ ఎలిమెంట్కు రెండేళ్లు, లోపలి ట్యాంకుకు ఐదేళ్ల వారంటీ అందిస్తున్నారు.

