ప్రభన్యూస్

J. D. Chakravarthy: నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్‌ని చూడలేదు.. జేడీ చక్రవర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. తాజాగా ఈ సినిమా నుంచి ది ఫ‌స్ట్ హ్యాండ్ అంటూ టీజ‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

News18
News18

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాత‌లు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో న‌టిస్తున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా నుంచి తాజాగా ది ఫ‌స్ట్ హ్యాండ్ అంటూ టీజ‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

విదేశాల్లో చదువుకోవాలని అనుకునే ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్‌లోకి దిగడం..అక్క‌డ వాళ్ల‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తి క్యారెక్ట‌ర్ ప‌రిచ‌యం.. అక్క‌డి నుంచి క‌థ‌లో కీల‌క మ‌లుపులు.. వీట‌న్నింటిని క‌ల‌గ‌లిపిన ఫ‌స్ట్ హ్యాండ్ టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. ప్ర‌స్తుతానికి సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

ఈ చిత్రానికి ఎదురోలు రాజు కెమెరామెన్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా వర్క్ చేయనున్నారు. ఈ మూవీకి గ్యానీ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్లు ఫేమ్), శ్రియా కొంతం (శుభం ఫేమ్), నిర్మల్ (డెబ్యూ హీరో), జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు నటిస్తున్నారు. గ్యానీ సంగీతం అందిస్తున్నారు.

ఈ ఈవెంట్ లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘పాకెట్ రాకెట్స్’ చిత్రాన్ని జులైలో ప్రారంభించాం. రుద్రతో మాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. అంజి, ఏసు, జేడీ గారి పాత్రలు అద్భుతంగా ఉంటాయి. ఆరు నెలల్లో సినిమాని పూర్తి చేసి, రిలీజ్ చేస్తున్నాం. డిసెంబర్ 11న మా చిత్రం రాబోతోంది. ఇక రిలీజ్ వరకు మేమంతా మీ సోషల్ మీడియాలోకి, మీ ఇంట్లోకి వచ్చేస్తాం’ అని అన్నారు.

జేడీ చక్రవర్తి మాట్లాడుతూ .. ‘‘పాకెట్ రాకెట్స్’ సినిమా కోసం నేను అక్టోబర్‌లో షూట్ చేశాను. నవంబర్‌లో టీజర్ అన్నారు, డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నారు. నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్‌ని చూడలేదు. ఈ సినిమా స్కేల్‌ని మన్యం రమేష్ గారు పెంచారు. రుద్ర గారు ఏం తీశారు, ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లోనే చూసి తెలుసుకోండి. ఈ సినిమా డిసెంబర్ 11న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 November 2026, 1:06 pm Digital Edition : Prabhanews
J. D. Chakravarthy: నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్‌ని చూడలేదు.. జేడీ చక్రవర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 04, 2026 12:41 PM ISTనిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. తాజాగా ఈ సినిమా నుంచి ది ఫ‌స్ట్ హ్యాండ్ అంటూ టీజ‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. News18నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాత‌లు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో న‌టిస్తున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా నుంచి తాజాగా ది ఫ‌స్ట్ హ్యాండ్ అంటూ టీజ‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.విదేశాల్లో చదువుకోవాలని అనుకునే ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్‌లోకి దిగడం..అక్క‌డ వాళ్ల‌కు జేడీ చ‌క్ర‌వ‌ర్తి క్యారెక్ట‌ర్ ప‌రిచ‌యం.. అక్క‌డి నుంచి క‌థ‌లో కీల‌క మ‌లుపులు.. వీట‌న్నింటిని క‌ల‌గ‌లిపిన ఫ‌స్ట్ హ్యాండ్ టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. ప్ర‌స్తుతానికి సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.ఈ చిత్రానికి ఎదురోలు రాజు కెమెరామెన్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా వర్క్ చేయనున్నారు. ఈ మూవీకి గ్యానీ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్లు ఫేమ్), శ్రియా కొంతం (శుభం ఫేమ్), నిర్మల్ (డెబ్యూ హీరో), జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు నటిస్తున్నారు. గ్యానీ సంగీతం అందిస్తున్నారు.ఈ ఈవెంట్ లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘పాకెట్ రాకెట్స్’ చిత్రాన్ని జులైలో ప్రారంభించాం. రుద్రతో మాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. అంజి, ఏసు, జేడీ గారి పాత్రలు అద్భుతంగా ఉంటాయి. ఆరు నెలల్లో సినిమాని పూర్తి చేసి, రిలీజ్ చేస్తున్నాం. డిసెంబర్ 11న మా చిత్రం రాబోతోంది. ఇక రిలీజ్ వరకు మేమంతా మీ సోషల్ మీడియాలోకి, మీ ఇంట్లోకి వచ్చేస్తాం’ అని అన్నారు.జేడీ చక్రవర్తి మాట్లాడుతూ .. ‘‘పాకెట్ రాకెట్స్’ సినిమా కోసం నేను అక్టోబర్‌లో షూట్ చేశాను. నవంబర్‌లో టీజర్ అన్నారు, డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నారు. నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్‌ని చూడలేదు. ఈ సినిమా స్కేల్‌ని మన్యం రమేష్ గారు పెంచారు. రుద్ర గారు ఏం తీశారు, ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లోనే చూసి తెలుసుకోండి. ఈ సినిమా డిసెంబర్ 11న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.మరింత చదవండి

Source link