వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, అది వైర్డ్ ఛార్జింగ్‌తో పోలిస్తే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడి బ్యాటరీపై ప్రభావం చూపి, కాలక్రమేణా దాని సామర్థ్యాన్ని తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా తరచుగా వైర్‌లెస్ ఛార్జింగ్ ఉపయోగించే వారికి ఈ ప్రభావం మరింత కనిపించవచ్చు. MagSafe వంటి టెక్నాలజీలు మెరుగ్గా పనిచేసినా, బ్యాటరీ ఆరోగ్యాన్ని ఎక్కువకాలం కాపాడుకోవాలనుకునే వారు సాధ్యమైనంత వరకు వైర్డ్ ఛార్జర్‌ను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. బ్యాటరీని 20-80 శాతం మధ్య ఉంచడం, రాత్రంతా ఛార్జింగ్‌లో పెట్టకుండా ఉండటం, నాణ్యమైన ఛార్జర్లు ఉపయోగించడం, వేడిగా ఉన్న ప్రదేశాల్లో ఛార్జింగ్ చేయకుండా ఉండటం, వీలైనంత వరకు వైర్డ్ ఛార్జింగ్‌ను ఎంచుకోవడం వంటి అలవాట్లు బ్యాటరీ పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ సూచనలు పాటిస్తే ఐఫోన్‌తో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్‌ల బ్యాటరీ జీవితకాలాన్ని కూడా గణనీయంగా పెంచుకోవచ్చు.

