ప్రభన్యూస్

Indian Railways: రైల్వేల్లో మరో కీలక ముందడుగు.. దేశంలో తొలి LNG రైలును ప్రారంభించిన అమిత్ షా! | బిజినెస్


Last Updated:

Indian Railways: భారతీయ రైల్వేల్లో పర్యావరణహిత రవాణాకు మరో కీలక అడుగు పడింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సబర్మతి రైల్వే స్టేషన్‌ వద్ద కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా దేశంలోనే తొలి LNG ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు.

News18
News18

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి రైల్వే స్టేషన్ వద్ద రూ.1,472 కోట్ల విలువైన పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి LNG (ద్రవీకృత సహజ వాయువు) ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే లోకోమోటివ్ ఇంజిన్ల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన WAG-12 మెయింటెనెన్స్ షెడ్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సబర్మతి డివిజన్‌లో ప్రయాణికుల సౌకర్యాలు, రైల్వే భద్రత, పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రాజెక్టులను చేపట్టినట్లు అమిత్ షా తెలిపారు. సబర్మతి ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని, సత్యాగ్రహం, ఖాదీ, గ్రామీణాభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలకు ఈ ప్రాంతం కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే సబర్మతి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాలు, రవాణా అనుసంధానం, భద్రతలో భారీ మార్పులు వచ్చాయని చెప్పారు. సుమారు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన WAG-12 మెయింటెనెన్స్ షెడ్ భారీ లోకోమోటివ్‌ల నిర్వహణకు ఉపయోగపడుతుందని అమిత్ షా వివరించారు. 12,000 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన WAG-12 ట్విన్-సెక్షన్ ఇంజిన్‌ను కూడా ప్రారంభించారు. దాదాపు 600 ట్రక్కుల బరువుకు సమానమైన సరుకును ఒకే లోకోమోటివ్ లాగగలదని తెలిపారు. గతంలో ఇలాంటి సరుకు రవాణాకు రెండు ఇంజిన్లు అవసరమయ్యేవని చెప్పారు.

ఇవి కూడా చదవండి: 8th Pay Commission: ఒక్కొక్క ఉద్యోగికి అత్యంత భారీగా పెరగనున్న జీతాలు.. రూ.72,000 కనీస వేతనం.. ఎప్పుడంటే?

రైళ్ల భద్రతను పెంచేందుకు సబర్మతి-కలోల్ మార్గంలో రూ.48 కోట్ల వ్యయంతో ‘కవచ్’ రైలు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అహ్మదాబాద్-పాలన్‌పూర్, అహ్మదాబాద్-సమఖియాలి మార్గాల్లో కవచ్ అమలు పనులు, సబర్మతి-సర్ఖేజ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులు కూడా ప్రారంభమైనట్లు వెల్లడించారు. 2014 తర్వాత భారతీయ రైల్వేల్లో ఆధునికీకరణ వేగం పెరిగిందని అమిత్ షా అన్నారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, డబుల్-స్టాక్ కంటైనర్ రైళ్లు, రాపిడ్ రైల్ వ్యవస్థ, ఆధునిక రైల్వే స్టేషన్లు వంటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఇటీవల హైడ్రోజన్ ఆధారిత రైలును కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

రైల్వే విద్యుదీకరణలోనూ భారత్ వేగంగా ముందుకు సాగుతోందని అమిత్ షా చెప్పారు. 2023-24లో ఒక్క ఏడాదిలోనే 7,188 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ జరిగిందని, ప్రస్తుతం రైల్వే నెట్‌వర్క్‌లో 99.6 శాతం విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. డీజిల్ వినియోగం 2015-16లో 293 కోట్ల లీటర్ల నుంచి 2024-25లో 108 కోట్ల లీటర్లకు తగ్గిందని పేర్కొన్నారు. గుజరాత్ రైల్వే బడ్జెట్ కేటాయింపులను కూడా అమిత్ షా ప్రస్తావించారు. 2009-14 మధ్య గుజరాత్‌కు రూ.589 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించగా, 2026-27లో ఒక్క ఏడాదికే రూ.17,366 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు చేసిన ఆయన, రైల్వే అభివృద్ధిపై రాజకీయ ఆరోపణలకు బదులుగా వాస్తవాలు, గణాంకాలతో చర్చ జరగాలని అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 September 2026, 4:01 pm Digital Edition : Prabhanews
Indian Railways: రైల్వేల్లో మరో కీలక ముందడుగు.. దేశంలో తొలి LNG రైలును ప్రారంభించిన అమిత్ షా! | బిజినెస్

Last Updated:Sep 27, 2026 3:57 PM ISTIndian Railways: భారతీయ రైల్వేల్లో పర్యావరణహిత రవాణాకు మరో కీలక అడుగు పడింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సబర్మతి రైల్వే స్టేషన్‌ వద్ద కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా దేశంలోనే తొలి LNG ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు.
News18కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి రైల్వే స్టేషన్ వద్ద రూ.1,472 కోట్ల విలువైన పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి LNG (ద్రవీకృత సహజ వాయువు) ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే లోకోమోటివ్ ఇంజిన్ల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన WAG-12 మెయింటెనెన్స్ షెడ్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.సబర్మతి డివిజన్‌లో ప్రయాణికుల సౌకర్యాలు, రైల్వే భద్రత, పర్యావరణ సుస్థిరతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రాజెక్టులను చేపట్టినట్లు అమిత్ షా తెలిపారు. సబర్మతి ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని, సత్యాగ్రహం, ఖాదీ, గ్రామీణాభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలకు ఈ ప్రాంతం కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే సబర్మతి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యాలు, రవాణా అనుసంధానం, భద్రతలో భారీ మార్పులు వచ్చాయని చెప్పారు. సుమారు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన WAG-12 మెయింటెనెన్స్ షెడ్ భారీ లోకోమోటివ్‌ల నిర్వహణకు ఉపయోగపడుతుందని అమిత్ షా వివరించారు. 12,000 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన WAG-12 ట్విన్-సెక్షన్ ఇంజిన్‌ను కూడా ప్రారంభించారు. దాదాపు 600 ట్రక్కుల బరువుకు సమానమైన సరుకును ఒకే లోకోమోటివ్ లాగగలదని తెలిపారు. గతంలో ఇలాంటి సరుకు రవాణాకు రెండు ఇంజిన్లు అవసరమయ్యేవని చెప్పారు.ఇవి కూడా చదవండి: 8th Pay Commission: ఒక్కొక్క ఉద్యోగికి అత్యంత భారీగా పెరగనున్న జీతాలు.. రూ.72,000 కనీస వేతనం.. ఎప్పుడంటే?రైళ్ల భద్రతను పెంచేందుకు సబర్మతి-కలోల్ మార్గంలో రూ.48 కోట్ల వ్యయంతో 'కవచ్' రైలు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అహ్మదాబాద్-పాలన్‌పూర్, అహ్మదాబాద్-సమఖియాలి మార్గాల్లో కవచ్ అమలు పనులు, సబర్మతి-సర్ఖేజ్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులు కూడా ప్రారంభమైనట్లు వెల్లడించారు. 2014 తర్వాత భారతీయ రైల్వేల్లో ఆధునికీకరణ వేగం పెరిగిందని అమిత్ షా అన్నారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, డబుల్-స్టాక్ కంటైనర్ రైళ్లు, రాపిడ్ రైల్ వ్యవస్థ, ఆధునిక రైల్వే స్టేషన్లు వంటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఇటీవల హైడ్రోజన్ ఆధారిత రైలును కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు.రైల్వే విద్యుదీకరణలోనూ భారత్ వేగంగా ముందుకు సాగుతోందని అమిత్ షా చెప్పారు. 2023-24లో ఒక్క ఏడాదిలోనే 7,188 కిలోమీటర్ల మేర విద్యుదీకరణ జరిగిందని, ప్రస్తుతం రైల్వే నెట్‌వర్క్‌లో 99.6 శాతం విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. డీజిల్ వినియోగం 2015-16లో 293 కోట్ల లీటర్ల నుంచి 2024-25లో 108 కోట్ల లీటర్లకు తగ్గిందని పేర్కొన్నారు. గుజరాత్ రైల్వే బడ్జెట్ కేటాయింపులను కూడా అమిత్ షా ప్రస్తావించారు. 2009-14 మధ్య గుజరాత్‌కు రూ.589 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించగా, 2026-27లో ఒక్క ఏడాదికే రూ.17,366 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు చేసిన ఆయన, రైల్వే అభివృద్ధిపై రాజకీయ ఆరోపణలకు బదులుగా వాస్తవాలు, గణాంకాలతో చర్చ జరగాలని అన్నారు.మరింత చదవండి

Source link