Last Updated:
Hyderabad Real Estate: దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గుతున్నా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాత్రం దూసుకెళ్తోంది. 2026 ఏప్రిల్-జూన్‌లో నగరంలో ఏకంగా 13,196 ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు ఎంత పెరిగాయో తెలుసా?
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గినప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, కొనుగోలుదారుల్లో పెరుగుతున్న ఆచితూచి వ్యవహరించే ధోరణి కారణంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహాల విక్రయాలు 6 శాతం తగ్గగా.. హైదరాబాద్‌లో మాత్రం ఏకంగా 15 శాతం వృద్ధి నమోదైంది. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో హైదరాబాద్‌లో 13,196 నివాస యూనిట్లు విక్రయమైనట్లు PropTiger ‘రియల్ ఇన్‌సైట్’ నివేదిక వెల్లడించింది.

