అలాగే ఇప్పటికే జలుబు, దగ్గు, గొంతునొప్పి, సైనస్ లేదా అలర్జీ సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుల సలహా మేరకు పెరుగు తీసుకోవడం మంచిది. ప్రతి ఒక్కరి శరీర తత్వం వేర్వేరుగా ఉండటంతో అందరికీ ఒకే విధమైన ఆహార నియమాలు వర్తించవని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో పెరుగు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, అయితే తాజా పెరుగును సరైన సమయంలో, పరిమిత మోతాదులో తీసుకోవడం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
