ప్రభన్యూస్

Gold Rate Today: సిల్వర్ ఢమాల్.. గోల్డ్ కూడా.. నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? | బిజినెస్


Last Updated:

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూద్దాం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ రేట్లపై నెలకొన్న అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. చైర్మన్ కెవిన్ వార్ష్ ట్రంప్ అంచనాలను తలకిందులు చేస్తూ.. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్ తర్వాత అమెరికన్ మార్కెట్లలో అలజడి రేగింది. సెప్టెంబర్ నెలలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని ఆయన మాటలను బట్టి అర్థం అయ్యింది. ద్రవ్యోల్బణం 2 శాతం లోపల ఉండకపోతే తర్వాతి మీటింగ్‌లో వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతో బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. గురువారం బంగారం ఫ్లాట్‌గా ఉండగా.. వెండి భారీగా పడింది.

ఉదయం 9:05 నిమిషాలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం పతనమైంది. ఆగస్టు 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,41,812 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.22 స్వల్పంగా పెరిగింది. ఇక వెండి మాత్రం కుప్పకూలింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,16,300 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.1,179 తగ్గింది.

ఫ్యూచర్స్ మార్కెట్ మాత్రమే కాకుండా స్పాట్ మార్కెట్‌లో కూడా వెండి భారీగా పతనం అయ్యింది. బంగారం మాత్రం స్వల్పంగా తగ్గింది. ఉదయం 9:10 గంటలకు bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే రూ.260 తగ్గి రూ.1,42,530కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గి ప్రస్తుతం రూ.1,30,653 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు మాత్రం బంగారంలా కాకుండా పెరిగాయి. గత మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కిలో వెండిపై రూ.1,150 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,17,010 వద్ద కొనసాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 July 2026, 9:23 am Digital Edition : Prabhanews
Gold Rate Today: సిల్వర్ ఢమాల్.. గోల్డ్ కూడా.. నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? | బిజినెస్

Last Updated:Jul 30, 2026 9:13 AM ISTGold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రతీకాత్మక చిత్రంఅమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ రేట్లపై నెలకొన్న అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. చైర్మన్ కెవిన్ వార్ష్ ట్రంప్ అంచనాలను తలకిందులు చేస్తూ.. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్స్ తర్వాత అమెరికన్ మార్కెట్లలో అలజడి రేగింది. సెప్టెంబర్ నెలలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని ఆయన మాటలను బట్టి అర్థం అయ్యింది. ద్రవ్యోల్బణం 2 శాతం లోపల ఉండకపోతే తర్వాతి మీటింగ్‌లో వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతో బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. గురువారం బంగారం ఫ్లాట్‌గా ఉండగా.. వెండి భారీగా పడింది.ఉదయం 9:05 నిమిషాలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం పతనమైంది. ఆగస్టు 5 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,41,812 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.22 స్వల్పంగా పెరిగింది. ఇక వెండి మాత్రం కుప్పకూలింది. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,16,300 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.1,179 తగ్గింది.ఫ్యూచర్స్ మార్కెట్ మాత్రమే కాకుండా స్పాట్ మార్కెట్‌లో కూడా వెండి భారీగా పతనం అయ్యింది. బంగారం మాత్రం స్వల్పంగా తగ్గింది. ఉదయం 9:10 గంటలకు bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే రూ.260 తగ్గి రూ.1,42,530కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గి ప్రస్తుతం రూ.1,30,653 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు మాత్రం బంగారంలా కాకుండా పెరిగాయి. గత మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కిలో వెండిపై రూ.1,150 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,17,010 వద్ద కొనసాగుతోంది.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link