సాధారణంగా గ్యాస్ స్టవ్‌పై నీలి రంగు మంట కనిపిస్తుంది. అయితే అది పసుపు లేదా నారింజ రంగులోకి మారితే ముందుగా బర్నర్‌ను పరిశీలించాలి. గ్యాస్‌తో గాలి సరైన నిష్పత్తిలో కలవకపోవడం, బర్నర్ రంధ్రాల్లో మురికి పేరుకుపోవడం, ఆహార పదార్థాల అవశేషాలు అడ్డుపడటం వంటి కారణాలతో మంట రంగు మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పాలు పొంగడం, కూరలు చిందడం, నూనె బర్నర్‌పై పడటం వంటివి తరచుగా జరుగుతుండటంతో ఈ మురికి క్రమంగా పేరుకుపోవచ్చు.
