Last Updated:
ETF New Rules | ఈరోజు నుంచి ఈటీఎఫ్ ట్రేడింగ్‌లో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. సెబీ తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల ఈటీఎఫ్స్‌కు బేస్ ప్రైస్, ప్రైస్ బ్యాండ్స్, ప్రీ-ఓపెన్ సెషన్‌లో కాల్ ఆక్షన్, క్లోజ్-అవుట్ విధానంలో మార్పులు వస్తాయి. ఈ మార్పులు ఈటీఎఫ్‌లలో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లకు ముఖ్యమైనవి.
ఎక్స్చేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్స్)కు సంబంధించిన కొత్త ట్రేడింగ్ నిబంధనలు సెప్టెంబర్ 7 నుంచి అమల్లోకి వచ్చాయి. ముందుగా ఇవి సెప్టెంబర్ 1 నుంచే అమలు కావాల్సి ఉంది. అయితే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆ గడువును వారం రోజులు వెనక్కి నెట్టింది. సీఎన్‌బీసీటీవీ18 కథనం ప్రకారం జూన్ 15న విడుదల చేసిన సర్క్యులర్‌లో సెబీ ఈటీఎఫ్స్‌కు సంబంధించిన కొత్త విధానాన్ని ప్రకటించింది. ఇందులో బేస్ ప్రైస్, ప్రైస్ బ్యాండ్స్, ప్రీ-ఓపెన్ సెషన్‌లో కాల్ ఆక్షన్, క్లోజ్-అవుట్ ప్రొసీజర్ వంటి అంశాలు ఉన్నాయి. స్టాక్ ఎక్స్చేంజ్‌ల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించిన తర్వాత సెబీ ఆగస్టు 28న అమలు గడువును పొడిగించింది. కొత్త నిబంధనలు సాఫీగా అమల్లోకి రావడమే ఈ గడువు పెంపు ఉద్దేశమని సెబీ తెలిపింది. జూన్ 15న తీసుకొచ్చిన నిబంధనల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.

