స్పైసీ ఎగ్ సలాడ్: ఉడకబెట్టిన గుడ్లను కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. వాటికి కీరదోస, లెట్యూస్ ఆకులు, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు జత చేయాలి. కొద్దిగా నిమ్మరసం, మిరియాల పొడి, మీకు ఇష్టమైన హెర్బ్స్ కలుపుకోవాలి. మధ్యాహ్నం లేదా రాత్రి పూట హెవీగా తినకూడదు అనుకున్నప్పుడు ఈ లైట్ సలాడ్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
