Last Updated:
భారత రక్షణ రంగంలో ఇప్పుడు కీలక మార్పుకు నాంది పడిందా? ఐదో తరం యుద్ధ విమానం AMCA కోసం భారత్‌లోనే అధునాతన ఫైటర్ జెట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్ చేతులు కలిపాయి. అసలు ఈ భాగస్వామ్యం ద్వారా ఏం తయారు చేయబోతున్నారు? ఈ డీల్ విజయవంతమైతే భారత రక్షణ రంగానికి, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి ఎలాంటి బూస్ట్ లభించనుంది? పూర్తి వివరాలు తెలుసుకోండి.
Reliance Rolls Royce Deal: భారత రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించే లక్ష్యానికి మరో కీలక ముందడుగు పడింది. భారతదేశానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), బ్రిటన్‌కు చెందిన రోల్స్-రాయిస్ హోల్డింగ్స్ పీఎల్‌సీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. దేశంలోనే ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) కోసం అధునాతన పోరాట విమాన ఇంజిన్‌ను డిజైన్, అభివృద్ధి, తయారీ చేసే లక్ష్యంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ కూటమి భారత ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో దీర్ఘకాలిక మార్పులకు దారితీసే అవకాశముంది.

