ప్రభన్యూస్

Dasara Special Trains: దసరాకు ఊరెళ్లే వారికి బంపర్ ఆఫర్.. రైల్వే శాఖ చెప్పిన ఈ శుభవార్త వింటే ఎగిరి గంతేస్తారు! | బిజినెస్


చర్లపల్లి-నిజాముద్దీన్, చర్లపల్లి-ససరామ్ మార్గాల్లో అప్, డౌన్ దిశల్లో ఈ 42 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 8వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు చర్లపల్లి-ససరామ్ (07041) మార్గంలో 8 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఇవి చర్లపల్లిలో ప్రతీ గురువారం బయలుదేరి కాజీపేటకు చేరుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్తాయి. అటు ససరామ్-చర్లపల్లి (07042) మార్గంలో అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ వరకు ప్రతీ శుక్రవారం బయలుదేరే 8 ప్రత్యేక రైళ్లు మరుసటి రోజుకు కాజీపేట చేరుకుంటాయి. పండుగ రద్దీని గణనీయంగా తగ్గించడంలో ఈ రైళ్లు కీలకంగా మారనున్నాయి.

ఇది కూడా చదవండి: Electric Scooters: రూ.లక్షకే 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. పండుగ వేళ బంపర్ ఆఫర్, అదిరే ఫీచర్లతో..

ఉత్తర భారతదేశానికి వెళ్లే ప్రయాణికులకు ఈ చర్లపల్లి-ససరామ్ మార్గం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లకు దారి పొడవునా పలు ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. కాజీపేటతో పాటు తెలంగాణలోని పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లలో ఇవి ఆగుతాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని బల్లార్షా, నాగ్ పూర్, ఇటార్సీ, పిపరియా, మదన్ మహల్, కట్నీ, సత్నా, మాణిక్ పూర్, ప్రయాగ్ రాజ్ ఛౌకి, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ స్టేషన్లలో కూడా ఈ రైళ్లకు నిలుపుదల ఉంది. ఈ సదుపాయంతో పండుగ రోజుల్లో టికెట్ల కోసం ఇబ్బంది పడే వందలాది మంది ప్రయాణికులకు భారీ ఊరట లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Electric Bike: ఒక్కసారి చార్జింగ్ పెడితే 323 కిమి వెళ్లొచ్చు..మతిపోగొట్టే ఎలక్ట్రిక్ బైక్, ఇక ఈ ఊరిలో కొనొచ్చు!

మరోవైపు దేశ రాజధాని వైపు వెళ్లే మార్గంలోనూ దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అక్టోబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ (07021) 7 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఇవి ప్రతీ సోమవారం చర్లపల్లిలో బయలుదేరి కాజీపేట మీదుగా వెళ్తాయి. తిరిగి హజ్రత్ నిజాముద్దీన్-చర్లపల్లి (07022) మార్గంలో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు 7 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రతీ బుధవారం హజ్రత్ నిజాముద్దీన్‌లో బయలుదేరే ఈ రైళ్లు మరుసటి రోజు కాజీపేటకు చేరుకుంటాయి. వీటికి కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా, నాగ్ పూర్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, గ్వాలియర్, ధోలాపూర్, ఆగ్రా, మధురా, కోసి కళన్ స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.

ఇవే కాకుండా చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ (07023) మార్గంలో అక్టోబర్ 20 నుంచి నవంబర్ 24వ తేదీ వరకు మరో 6 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇవి ప్రతీ మంగళవారం చర్లపల్లిలో బయలుదేరి కాజీపేట మీదుగా ప్రయాణిస్తాయి. తిరిగి హజ్రత్ నిజాముద్దీన్-చర్లపల్లి (07024) మార్గంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ప్రతీ గురువారం బయలుదేరే 6 ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు కాజీపేట చేరుకుంటాయి. ఈ రైళ్లకు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా, నాగ్ పూర్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా స్టేషన్లలో నిలుపుదల సదుపాయం కల్పించారు. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కల్పించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 October 2026, 7:57 am Digital Edition : Prabhanews
Dasara Special Trains: దసరాకు ఊరెళ్లే వారికి బంపర్ ఆఫర్.. రైల్వే శాఖ చెప్పిన ఈ శుభవార్త వింటే ఎగిరి గంతేస్తారు! | బిజినెస్

చర్లపల్లి-నిజాముద్దీన్, చర్లపల్లి-ససరామ్ మార్గాల్లో అప్, డౌన్ దిశల్లో ఈ 42 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇందులో భాగంగా అక్టోబర్ 8వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు చర్లపల్లి-ససరామ్ (07041) మార్గంలో 8 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఇవి చర్లపల్లిలో ప్రతీ గురువారం బయలుదేరి కాజీపేటకు చేరుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్తాయి. అటు ససరామ్-చర్లపల్లి (07042) మార్గంలో అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ వరకు ప్రతీ శుక్రవారం బయలుదేరే 8 ప్రత్యేక రైళ్లు మరుసటి రోజుకు కాజీపేట చేరుకుంటాయి. పండుగ రద్దీని గణనీయంగా తగ్గించడంలో ఈ రైళ్లు కీలకంగా మారనున్నాయి.ఇది కూడా చదవండి: Electric Scooters: రూ.లక్షకే 3 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. పండుగ వేళ బంపర్ ఆఫర్, అదిరే ఫీచర్లతో..ఉత్తర భారతదేశానికి వెళ్లే ప్రయాణికులకు ఈ చర్లపల్లి-ససరామ్ మార్గం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లకు దారి పొడవునా పలు ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. కాజీపేటతో పాటు తెలంగాణలోని పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లలో ఇవి ఆగుతాయి. ఆ తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని బల్లార్షా, నాగ్ పూర్, ఇటార్సీ, పిపరియా, మదన్ మహల్, కట్నీ, సత్నా, మాణిక్ పూర్, ప్రయాగ్ రాజ్ ఛౌకి, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ స్టేషన్లలో కూడా ఈ రైళ్లకు నిలుపుదల ఉంది. ఈ సదుపాయంతో పండుగ రోజుల్లో టికెట్ల కోసం ఇబ్బంది పడే వందలాది మంది ప్రయాణికులకు భారీ ఊరట లభిస్తుంది.ఇది కూడా చదవండి: Electric Bike: ఒక్కసారి చార్జింగ్ పెడితే 323 కిమి వెళ్లొచ్చు..మతిపోగొట్టే ఎలక్ట్రిక్ బైక్, ఇక ఈ ఊరిలో కొనొచ్చు!మరోవైపు దేశ రాజధాని వైపు వెళ్లే మార్గంలోనూ దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అక్టోబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ (07021) 7 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఇవి ప్రతీ సోమవారం చర్లపల్లిలో బయలుదేరి కాజీపేట మీదుగా వెళ్తాయి. తిరిగి హజ్రత్ నిజాముద్దీన్-చర్లపల్లి (07022) మార్గంలో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు 7 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రతీ బుధవారం హజ్రత్ నిజాముద్దీన్‌లో బయలుదేరే ఈ రైళ్లు మరుసటి రోజు కాజీపేటకు చేరుకుంటాయి. వీటికి కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా, నాగ్ పూర్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, గ్వాలియర్, ధోలాపూర్, ఆగ్రా, మధురా, కోసి కళన్ స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.ఇవే కాకుండా చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ (07023) మార్గంలో అక్టోబర్ 20 నుంచి నవంబర్ 24వ తేదీ వరకు మరో 6 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇవి ప్రతీ మంగళవారం చర్లపల్లిలో బయలుదేరి కాజీపేట మీదుగా ప్రయాణిస్తాయి. తిరిగి హజ్రత్ నిజాముద్దీన్-చర్లపల్లి (07024) మార్గంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ప్రతీ గురువారం బయలుదేరే 6 ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు కాజీపేట చేరుకుంటాయి. ఈ రైళ్లకు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా, నాగ్ పూర్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా స్టేషన్లలో నిలుపుదల సదుపాయం కల్పించారు. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కల్పించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Source link