మరి ఎంతసేపు నడవాలి? భోజనం తర్వాత బ్లడ్ షుగర్ నియంత్రణకు ఒకే నిర్దిష్ట సమయం అందరికీ సరిపోదు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, తీసుకున్న ఆహారం, శారీరక సామర్థ్యం వంటి అంశాలపై ప్రభావం మారవచ్చు. కాబట్టి 20 నిమిషాలు నడవలేని వారు 5 లేదా 10 నిమిషాలతో ప్రారంభించి, క్రమంగా వాకింగ్‌ను రోజువారీ అలవాటుగా మార్చుకోవచ్చు. అయితే వాకింగ్ అనేది మధుమేహానికి మందులు లేదా వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. డయాబెటిస్ ఉన్నవారు తమ వైద్యుడు సూచించిన మందులు, ఆహార నియమాలు, వ్యాయామ ప్రణాళికను కొనసాగించాలి. బ్లడ్ షుగర్‌లో తరచూ మార్పులు కనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.

