ప్రభన్యూస్

Cut Vegetables in the Refrigerator: కోసిన కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా?.. ఈ పొరపాట్లు చేస్తే ఆరోగ్యానికి ప్రమాదం! | లైఫ్ స్టైల్


Last Updated:

కోసిన కూరగాయలను ఎలా నిల్వ చేస్తున్నాం, ఎంతసేపు ఉంచుతున్నాం అనే విషయాలు కూడా చాలా ముఖ్యమైనవి. సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే వాటి తాజాదనం తగ్గడంతో పాటు బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

News18
News18

మనలో చాలామంది రోజువారీ వంటల్లో కూరగాయలను ఉపయోగించేటప్పుడు అవసరమైనంత మాత్రమే కోసి, మిగిలిన భాగాన్ని మరుసటి రోజు వాడుకునేందుకు నిల్వ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూరగాయలు వృథా కాకుండా ఉంటాయని భావిస్తారు. అయితే, కోసిన కూరగాయలను ఎలా నిల్వ చేస్తున్నాం, ఎంతసేపు ఉంచుతున్నాం అనే విషయాలు కూడా చాలా ముఖ్యమైనవి. సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే వాటి తాజాదనం తగ్గడంతో పాటు బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కోసిన కూరగాయలను భద్రపరిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ముందుగా, వంటకు ఎంత అవసరమో అంతమేరకే కూరగాయలను కోసుకోవడం మంచి అలవాటు. ఒకవేళ కూరగాయలు మిగిలిపోతే వాటిని ఎక్కువసేపు బయట ఉంచకుండా వెంటనే శుభ్రమైన, గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో భద్రపరచాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టినంత మాత్రాన అవి రోజుల తరబడి తాజాగా ఉంటాయని అనుకోవద్దు. వీలైనంత త్వరగా, ముఖ్యంగా రెండు నుంచి నాలుగు రోజుల్లోపు వాడుకోవడం మంచిది. ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రత సరిగ్గా ఉండటం, నిల్వ చేసే డబ్బాలు శుభ్రంగా ఉండటం కూడా కూరగాయల నాణ్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఆకుకూరలను నిల్వ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఆకుకూరలపై తేమ ఎక్కువగా ఉంటే అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని శుభ్రం చేసిన తర్వాత పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవచ్చు. డబ్బా అడుగున టిష్యూ పేపర్ వేయడం వల్ల అదనపు తేమను పీల్చుకోవడానికి సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల ఆకుకూరలు త్వరగా మెత్తబడకుండా ఉంటాయి.

క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయలను ఎండిపోకుండా ఉండేందుకు తేమగా ఉన్న పేపర్ టవల్‌లో చుట్టి డబ్బాలో పెట్టుకోవచ్చు. దోసకాయ, క్యాప్సికమ్ వంటి కూరగాయలను ముందుగా పొడిగా తుడిచి, పొడి పేపర్ టవల్‌లో చుట్టి నిల్వ చేయడం మంచిది. వీటిని కూడా వీలైనంత త్వరగా వంటల్లో ఉపయోగించాలి.

కూరగాయలపై బూజు కనిపించినా, రంగు మారినా, జిగురుగా ఉన్నా లేదా దుర్వాసన వచ్చినా వాటిని తినకూడదు. పాడైన భాగాన్ని మాత్రమే కత్తిరించి మిగిలినది వాడుకోవడం కూడా సురక్షితం కాకపోవచ్చు. ముఖ్యంగా మృదువైన కూరగాయల్లో బూజు లోపలికి వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి కూరగాయలను పూర్తిగా పారేయడం మంచిది.

కూరగాయలు వృథా కాకుండా చూసుకోవడం మంచి అలవాటే. అయితే, పొదుపుతో పాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. సరైన నిల్వ పద్ధతులు పాటిస్తూ, తాజా కూరగాయలను వాడటం ద్వారా కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 3:54 pm Digital Edition : Prabhanews
Cut Vegetables in the Refrigerator: కోసిన కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా?.. ఈ పొరపాట్లు చేస్తే ఆరోగ్యానికి ప్రమాదం! | లైఫ్ స్టైల్

Last Updated:Nov 21, 2026 3:36 PM ISTకోసిన కూరగాయలను ఎలా నిల్వ చేస్తున్నాం, ఎంతసేపు ఉంచుతున్నాం అనే విషయాలు కూడా చాలా ముఖ్యమైనవి. సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే వాటి తాజాదనం తగ్గడంతో పాటు బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఉంటుంది.News18మనలో చాలామంది రోజువారీ వంటల్లో కూరగాయలను ఉపయోగించేటప్పుడు అవసరమైనంత మాత్రమే కోసి, మిగిలిన భాగాన్ని మరుసటి రోజు వాడుకునేందుకు నిల్వ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూరగాయలు వృథా కాకుండా ఉంటాయని భావిస్తారు. అయితే, కోసిన కూరగాయలను ఎలా నిల్వ చేస్తున్నాం, ఎంతసేపు ఉంచుతున్నాం అనే విషయాలు కూడా చాలా ముఖ్యమైనవి. సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే వాటి తాజాదనం తగ్గడంతో పాటు బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కోసిన కూరగాయలను భద్రపరిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.ముందుగా, వంటకు ఎంత అవసరమో అంతమేరకే కూరగాయలను కోసుకోవడం మంచి అలవాటు. ఒకవేళ కూరగాయలు మిగిలిపోతే వాటిని ఎక్కువసేపు బయట ఉంచకుండా వెంటనే శుభ్రమైన, గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో భద్రపరచాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టినంత మాత్రాన అవి రోజుల తరబడి తాజాగా ఉంటాయని అనుకోవద్దు. వీలైనంత త్వరగా, ముఖ్యంగా రెండు నుంచి నాలుగు రోజుల్లోపు వాడుకోవడం మంచిది. ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రత సరిగ్గా ఉండటం, నిల్వ చేసే డబ్బాలు శుభ్రంగా ఉండటం కూడా కూరగాయల నాణ్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఆకుకూరలను నిల్వ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఆకుకూరలపై తేమ ఎక్కువగా ఉంటే అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని శుభ్రం చేసిన తర్వాత పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవచ్చు. డబ్బా అడుగున టిష్యూ పేపర్ వేయడం వల్ల అదనపు తేమను పీల్చుకోవడానికి సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల ఆకుకూరలు త్వరగా మెత్తబడకుండా ఉంటాయి.క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయలను ఎండిపోకుండా ఉండేందుకు తేమగా ఉన్న పేపర్ టవల్‌లో చుట్టి డబ్బాలో పెట్టుకోవచ్చు. దోసకాయ, క్యాప్సికమ్ వంటి కూరగాయలను ముందుగా పొడిగా తుడిచి, పొడి పేపర్ టవల్‌లో చుట్టి నిల్వ చేయడం మంచిది. వీటిని కూడా వీలైనంత త్వరగా వంటల్లో ఉపయోగించాలి.కూరగాయలపై బూజు కనిపించినా, రంగు మారినా, జిగురుగా ఉన్నా లేదా దుర్వాసన వచ్చినా వాటిని తినకూడదు. పాడైన భాగాన్ని మాత్రమే కత్తిరించి మిగిలినది వాడుకోవడం కూడా సురక్షితం కాకపోవచ్చు. ముఖ్యంగా మృదువైన కూరగాయల్లో బూజు లోపలికి వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి కూరగాయలను పూర్తిగా పారేయడం మంచిది.కూరగాయలు వృథా కాకుండా చూసుకోవడం మంచి అలవాటే. అయితే, పొదుపుతో పాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. సరైన నిల్వ పద్ధతులు పాటిస్తూ, తాజా కూరగాయలను వాడటం ద్వారా కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.మరింత చదవండి

Source link