ప్రభన్యూస్

Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు


2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ వేడుక కోసం రూ.3,723 కోట్లతో 440 స్నాన ఘాట్ల ఆధునికీకరణతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భక్తుల కోసం 4 వేల ప్రత్యేక బస్సులు, 1,560 ప్రత్యేక రైళ్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ మరియు 135 భాషల్లో సేవలందించే ఏఐ చాట్ బాట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నిత్య నదీ హారతి, సామూహిక కూచిపూడి నృత్యం, యోగా కార్యక్రమాలతో ఈ పుష్కరాలను చరిత్రాత్మకంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

2.ఇందిరమ్మ బీమా పథకం వీరికే మాత్రమే..

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ కింద కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, ఇతర ప్రభుత్వ బీమా పథకాల్లో లేని కుటుంబ పెద్దలు నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు ఈ స్కీమ్‌లో నమోదు చేసుకోవచ్చు. అర్హులైన వారు సమీపంలోని నమోదు కేంద్రానికి ఆధార్, కేవైసీ పూర్తయిన రేషన్ కార్డు మరియు ఆధార్ లింక్ అయిన మొబైల్ ఫోన్‌తో స్వయంగా వెళ్లి నామినీ వివరాలతో ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దివ్యాంగులు మరియు అనారోగ్యంతో ఉన్నవారి ఇంటికే అధికారులు వెళ్లి వివరాలు నమోదు చేస్తారు.

3.మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న ఓ పెయింట్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దుకాణం ముందు సైన్ బోర్డు ఏర్పాటు కోసం వెల్డింగ్ పనులు చేస్తుండగా ఎగిసిన నిప్పురవ్వలు రసాయనాలు, పెయింట్ డబ్బాలపై పడ్డాయి. దీంతో క్షణాల్లోనే మంటలు దుకాణమంతటా వ్యాపించి దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికులు భయాందోళనకు గురవ్వగా, అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

4.షర్మిల కూతురి పెళ్లి ఆహ్వానంపై రాద్ధాంతం ఎందుకు?

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం, పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్ సాధించామని, ఇది తమ రెండున్నరేళ్ల పాలనకు ప్రజలిచ్చిన తీర్పు అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహానికి ఆహ్వానిస్తే దానిపై అనవసర రాద్ధాంతం చేస్తూ, సొంత చెల్లెలిపై అడ్డమైన రాతలు రాయడం దారుణమని సీఎం మండిపడ్డారు. గతంలో తాను, వైఎస్సార్ రాజకీయంగా హోరాహోరీగా పోరాడినప్పటికీ వ్యక్తిగత సంబంధాలకు ఎప్పుడూ విలువ ఇచ్చామని, గతంలో షర్మిల వివాహానికి కూడా తాను హాజరయ్యానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

5.యువతను కాపాడుకోవాలి..

2029 నాటికి భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో జరిగిన ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ సదస్సులో మాట్లాడిన ఆయన, దేశ యువతను మత్తుపదార్థాల ఉచ్చులోకి నెట్టేందుకు విదేశీ శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. పంజాబ్ తరహాలోనే ఇప్పుడు హైదరాబాద్‌లోనూ డ్రగ్స్ విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయని, మూతపడిన కంపెనీల్లో డ్రగ్స్ తయారీ, ఇళ్ల పైకప్పులపై గంజాయి సాగు జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వాల వల్లే ఈ సమస్యను అరికట్టలేమని, ‘నషా ముక్త్ భారత్’ లక్ష్య సాధనలో యువత, మేధావులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

6.తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు ..

ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, యానాంలో శని, ఆదివారాల్లో వర్షాలు పడవచ్చని, సోమవారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే తెలంగాణలోనూ రాబోయే మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

7.బంగారం ధరలపై మోదీ కీలక వ్యాఖ్యలు

బంగారం ధరలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లఖ్‌నవూలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని నెలల క్రితం తాను చేసిన విజ్ఞప్తి మేరకు దేశ ప్రజలు బంగారం కొనుగోళ్లను నిలిపివేశారని మోదీ గుర్తుచేశారు. ప్రజలు బంగారం కొనకపోవడం వల్లే ప్రస్తుతం ధరలు తగ్గాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క ఏడాది పాటు అవసరం లేకపోతే బంగారం కొనవద్దని తాను గతంలో సలహా ఇచ్చినట్లు తెలిపారు. తన మాట విన్న ప్రజలు డబ్బును ఆదా చేసుకోగలిగారని ప్రధాని చెప్పారు. ఆ సలహాతో తమ డబ్బు మిగిలిందని ప్రజలు తనతో చెబుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారని మోదీ వివరించారు.

8.‘వృషకర్మ’ సినిమా విడుదల వాయిదా..

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా విడుదల వాయిదా పడినట్లు సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 4న కాకుండా, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మైథికల్ థ్రిల్లర్‌లో నాగచైతన్య పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నారు.

9.నేను మారే ప్రసక్తి లేదు..

అప్పట్లో తన జుట్టు చూసి చాలామంది నెగెటివ్‌గా కామెంట్ చేసేవారని, జుట్టును స్ట్రెయిట్ చేయించుకోవచ్చు కదా అని, కనుబొమ్మలు మరీ మందంగా ఉన్నాయని, కాస్త సన్నగా చేసుకోమని అనేవారని చెప్పారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్.. ఆ రోజుల్లో అవే ట్రెండ్స్‌గా ఉండేవని గుర్తుచేసుకున్నారు. అయితే ఆ మాటలకు ఎప్పుడూ తలొగ్గలేదని నిత్యా మీనన్ పేర్కొన్నారు. అప్పట్లో తనకు 15 ఏళ్లే అయినా, అందరిలా జుట్టును స్ట్రెయిట్ చేయించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని, దేవుడు ఇచ్చిన రూపం ఇదే కాబట్టి దీన్ని ఎలా బాగుండేలా చూసుకోవాలని ఆలోచించి, సహజంగానే దాన్ని అందంగా మలుచుకున్నానని అన్నారు. కృత్రిమంగా ఉండటం తనకు ఇష్టం లేదని, ఉల్లిపాయ పొరలను ఒక్కొక్కటిగా తీసినట్లు మనపై ఉన్న అనవసరపు పొరలను వదిలించుకుని అసలైన నిజాన్ని చేరుకోవడమే జీవిత లక్ష్యమని.. తాను మారే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.

10.భారత్‌ ఎదుగుదలను చూడలేకే.. పాక్‌కు చైనా మద్దతు

భారత్ ఎదుగుదలను అణచివేయాలనే ఉద్దేశంతోనే ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో చైనా.. పాకిస్థాన్‌కు సాంకేతిక, సైనిక మద్దతు అందించినట్లు అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. సరిహద్దుల వెంబడి సైనిక ఒత్తిడిని పెంచడంతో పాటు, హిందూ మహాసముద్రంలో నౌకాదళ ఉనికిని విస్తరిస్తూ. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద మౌలిక సదుపాయాలను నిర్మిస్తూ చైనా భారత్‌ను అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తోందని పేర్కొంది.చైనా ఎత్తుగడలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత్.. అమెరికాతో నిఘా, సముద్ర మరియు ఉత్పాదక రంగాల్లో మరింత లోతైన సహకారాన్ని పెంపొందించుకోవాలని ఈ నివేదిక సూచించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 9:36 pm Digital Edition : Prabhanews
Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ వేడుక కోసం రూ.3,723 కోట్లతో 440 స్నాన ఘాట్ల ఆధునికీకరణతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భక్తుల కోసం 4 వేల ప్రత్యేక బస్సులు, 1,560 ప్రత్యేక రైళ్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ మరియు 135 భాషల్లో సేవలందించే ఏఐ చాట్ బాట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నిత్య నదీ హారతి, సామూహిక కూచిపూడి నృత్యం, యోగా కార్యక్రమాలతో ఈ పుష్కరాలను చరిత్రాత్మకంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.2.ఇందిరమ్మ బీమా పథకం వీరికే మాత్రమే..తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' కింద కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, ఇతర ప్రభుత్వ బీమా పథకాల్లో లేని కుటుంబ పెద్దలు నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు ఈ స్కీమ్‌లో నమోదు చేసుకోవచ్చు. అర్హులైన వారు సమీపంలోని నమోదు కేంద్రానికి ఆధార్, కేవైసీ పూర్తయిన రేషన్ కార్డు మరియు ఆధార్ లింక్ అయిన మొబైల్ ఫోన్‌తో స్వయంగా వెళ్లి నామినీ వివరాలతో ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దివ్యాంగులు మరియు అనారోగ్యంతో ఉన్నవారి ఇంటికే అధికారులు వెళ్లి వివరాలు నమోదు చేస్తారు.3.మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదంహైదరాబాద్ మియాపూర్ పరిధిలోని హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ సమీపంలో ఉన్న ఓ పెయింట్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దుకాణం ముందు సైన్ బోర్డు ఏర్పాటు కోసం వెల్డింగ్ పనులు చేస్తుండగా ఎగిసిన నిప్పురవ్వలు రసాయనాలు, పెయింట్ డబ్బాలపై పడ్డాయి. దీంతో క్షణాల్లోనే మంటలు దుకాణమంతటా వ్యాపించి దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికులు భయాందోళనకు గురవ్వగా, అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.4.షర్మిల కూతురి పెళ్లి ఆహ్వానంపై రాద్ధాంతం ఎందుకు?స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం, పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్ సాధించామని, ఇది తమ రెండున్నరేళ్ల పాలనకు ప్రజలిచ్చిన తీర్పు అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహానికి ఆహ్వానిస్తే దానిపై అనవసర రాద్ధాంతం చేస్తూ, సొంత చెల్లెలిపై అడ్డమైన రాతలు రాయడం దారుణమని సీఎం మండిపడ్డారు. గతంలో తాను, వైఎస్సార్ రాజకీయంగా హోరాహోరీగా పోరాడినప్పటికీ వ్యక్తిగత సంబంధాలకు ఎప్పుడూ విలువ ఇచ్చామని, గతంలో షర్మిల వివాహానికి కూడా తాను హాజరయ్యానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.5.యువతను కాపాడుకోవాలి..2029 నాటికి భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో జరిగిన ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ సదస్సులో మాట్లాడిన ఆయన, దేశ యువతను మత్తుపదార్థాల ఉచ్చులోకి నెట్టేందుకు విదేశీ శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. పంజాబ్ తరహాలోనే ఇప్పుడు హైదరాబాద్‌లోనూ డ్రగ్స్ విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయని, మూతపడిన కంపెనీల్లో డ్రగ్స్ తయారీ, ఇళ్ల పైకప్పులపై గంజాయి సాగు జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వాల వల్లే ఈ సమస్యను అరికట్టలేమని, ‘నషా ముక్త్ భారత్’ లక్ష్య సాధనలో యువత, మేధావులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.6.తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు ..ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, యానాంలో శని, ఆదివారాల్లో వర్షాలు పడవచ్చని, సోమవారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే తెలంగాణలోనూ రాబోయే మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.7.బంగారం ధరలపై మోదీ కీలక వ్యాఖ్యలుబంగారం ధరలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లఖ్‌నవూలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని నెలల క్రితం తాను చేసిన విజ్ఞప్తి మేరకు దేశ ప్రజలు బంగారం కొనుగోళ్లను నిలిపివేశారని మోదీ గుర్తుచేశారు. ప్రజలు బంగారం కొనకపోవడం వల్లే ప్రస్తుతం ధరలు తగ్గాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక్క ఏడాది పాటు అవసరం లేకపోతే బంగారం కొనవద్దని తాను గతంలో సలహా ఇచ్చినట్లు తెలిపారు. తన మాట విన్న ప్రజలు డబ్బును ఆదా చేసుకోగలిగారని ప్రధాని చెప్పారు. ఆ సలహాతో తమ డబ్బు మిగిలిందని ప్రజలు తనతో చెబుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారని మోదీ వివరించారు.8.‘వృషకర్మ’ సినిమా విడుదల వాయిదా..అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా విడుదల వాయిదా పడినట్లు సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 4న కాకుండా, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మైథికల్ థ్రిల్లర్‌లో నాగచైతన్య పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నారు.9.నేను మారే ప్రసక్తి లేదు..అప్పట్లో తన జుట్టు చూసి చాలామంది నెగెటివ్‌గా కామెంట్ చేసేవారని, జుట్టును స్ట్రెయిట్ చేయించుకోవచ్చు కదా అని, కనుబొమ్మలు మరీ మందంగా ఉన్నాయని, కాస్త సన్నగా చేసుకోమని అనేవారని చెప్పారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్.. ఆ రోజుల్లో అవే ట్రెండ్స్‌గా ఉండేవని గుర్తుచేసుకున్నారు. అయితే ఆ మాటలకు ఎప్పుడూ తలొగ్గలేదని నిత్యా మీనన్ పేర్కొన్నారు. అప్పట్లో తనకు 15 ఏళ్లే అయినా, అందరిలా జుట్టును స్ట్రెయిట్ చేయించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని, దేవుడు ఇచ్చిన రూపం ఇదే కాబట్టి దీన్ని ఎలా బాగుండేలా చూసుకోవాలని ఆలోచించి, సహజంగానే దాన్ని అందంగా మలుచుకున్నానని అన్నారు. కృత్రిమంగా ఉండటం తనకు ఇష్టం లేదని, ఉల్లిపాయ పొరలను ఒక్కొక్కటిగా తీసినట్లు మనపై ఉన్న అనవసరపు పొరలను వదిలించుకుని అసలైన నిజాన్ని చేరుకోవడమే జీవిత లక్ష్యమని.. తాను మారే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.10.భారత్‌ ఎదుగుదలను చూడలేకే.. పాక్‌కు చైనా మద్దతుభారత్ ఎదుగుదలను అణచివేయాలనే ఉద్దేశంతోనే ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో చైనా.. పాకిస్థాన్‌కు సాంకేతిక, సైనిక మద్దతు అందించినట్లు అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. సరిహద్దుల వెంబడి సైనిక ఒత్తిడిని పెంచడంతో పాటు, హిందూ మహాసముద్రంలో నౌకాదళ ఉనికిని విస్తరిస్తూ. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద మౌలిక సదుపాయాలను నిర్మిస్తూ చైనా భారత్‌ను అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తోందని పేర్కొంది.చైనా ఎత్తుగడలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత్.. అమెరికాతో నిఘా, సముద్ర మరియు ఉత్పాదక రంగాల్లో మరింత లోతైన సహకారాన్ని పెంపొందించుకోవాలని ఈ నివేదిక సూచించింది.

Source link