ప్రభన్యూస్

Diwali Shopping: ఈసారి దీపావళి పండుగ ఖర్చు తడిసి మోపెడే.. ఒక్కసారిగా భారీగా పెరిగిన ధరలు? | బిజినెస్


మనీకంట్రోల్ వెల్లడించిన కథనం ప్రకారం.. ఈ ఏడాది టీవీలు, ఏసీలు, ఇతర గృహోపకరణాల ధరలు సుమారు 3 నుంచి 7 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైయర్, ఎల్‌జీ, బ్లూ స్టార్ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. సాధారణంగా దీపావళి సమయంలో కంపెనీలు ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తాయి. దీంతో కొత్త వస్తువులు కొనాలనుకునే వినియోగదారులకు కొంత ఊరట లభిస్తుంది. కానీ ఈసారి ఉత్పత్తుల ధరల పెరుగుదల కారణంగా ఆఫర్లు ఉన్నప్పటికీ కొనుగోలుదారులు గతం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ విజయ్ సేల్స్ ఈ పండుగ సీజన్‌లో అమ్మకాల మొత్తం విలువలో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. అయితే విక్రయించే వస్తువుల సంఖ్య మాత్రం ఒకే అంకెల వృద్ధికే పరిమితం కావచ్చని భావిస్తోంది. దీనిపై సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిలేష్ గుప్తా మాట్లాడుతూ, వినియోగదారులు ఈఎంఐల ద్వారా కొనుగోళ్లు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. తమ సంస్థలో జరిగే కొనుగోళ్లలో దాదాపు 70 శాతం ఈఎంఐల ద్వారానే జరుగుతున్నాయని చెప్పారు. పండుగ సీజన్ సానుకూలంగా ఉన్నప్పటికీ, అమ్మకాల విలువ పెరిగినంత స్థాయిలో వస్తువుల సంఖ్య పెరగకపోవచ్చని వివరించారు.

సెలెకార్ గాడ్జెట్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రవి అగర్వాల్ కూడా ఈ ఏడాది చిన్న, పెద్ద గృహోపకరణాల విభాగాల్లో కొన్ని సవాళ్లు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం వినియోగదారులు ఏ వస్తువు కొనాలన్నా ముందుగా దాని ధర, ఫీచర్లు, నాణ్యత, ఇతర కంపెనీల ఉత్పత్తులతో పోలికలను పరిశీలిస్తున్నారని తెలిపారు. తమ డబ్బుకు తగిన విలువ వచ్చే ఉత్పత్తినే ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు.

భారీగా పెరిగిన స్వీట్ల ధరలు?

దీపావళి సమయంలో స్వీట్లు, సంప్రదాయ వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఈసారి వాటి ధరలు కూడా వినియోగదారులకు భారంగా మారాయి. పాలు, కోవా, చక్కెర, డ్రై ఫ్రూట్స్‌తో పాటు ప్యాకేజింగ్ సామగ్రి ధరలు పెరగడంతో మిఠాయిల తయారీ ఖర్చు అధికమైంది. ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో చక్కెర ధర క్వింటాల్‌కు రూ.4,800 నుంచి రూ.5,700కు పెరిగింది. కర్ణాటకలో నందిని పాల ధరను లీటరుకు రూ.8 పెంచేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ పరిణామాలు స్వీట్ల ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

ఢిల్లీలోని ప్రముఖ స్వీట్ షాప్ చైన్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, పండుగ సమయంలో మిఠాయిలు, సంప్రదాయ వంటకాలకు డిమాండ్ తగ్గదని చెప్పారు. అయితే ధరలు పెరగడంతో వినియోగదారులు పెద్ద ప్యాకెట్లకు బదులుగా చిన్న ప్యాకెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. దీపావళికి కొద్ది రోజుల ముందు తమ సంస్థ ధరలను సుమారు 15 శాతం పెంచినట్లు వెల్లడించారు. జైపూర్‌కు చెందిన త్యోహార్ స్వీట్స్ యజమాని అంజలి జైన్ కూడా ఈ ఏడాది మిఠాయిల ధరలను 10 నుంచి 12 శాతం వరకు పెంచాల్సి వచ్చిందని తెలిపారు. పాలు, చక్కెర, డ్రై ఫ్రూట్స్‌తో పాటు స్వీట్లపై ఉపయోగించే వెండి అలంకరణ, ప్యాకేజింగ్ ఖర్చులు కూడా పెరిగాయని చెప్పారు. ఖర్చులు తగ్గించుకునేందుకు కొన్ని దుకాణాలు గిఫ్ట్ హ్యాంపర్లలో డ్రై ఫ్రూట్స్‌కు బదులుగా వివిధ రకాల విత్తనాల మిశ్రమాలను ఉపయోగిస్తున్నాయని వివరించారు.

పిస్తా, బాదం ధరలు భారీగా పెరిగాయ్

దీపావళి గిఫ్ట్ ప్యాకెట్లు, స్వీట్ల తయారీలో ఉపయోగించే డ్రై ఫ్రూట్స్ ధరలు కూడా ఈసారి గణనీయంగా పెరిగాయి. గత ఏడాది దీపావళి సమయంలో కిలో బాదం ధర రూ.800 నుంచి రూ.900 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.1,000 నుంచి రూ.1,200కు చేరింది. పిస్తా ధర మరింత ఎక్కువగా పెరిగింది. గత ఏడాది కిలో రూ.900కు లభించిన పిస్తా ఇప్పుడు రూ.1,500 నుంచి రూ.2,100 వరకు పలుకుతోంది. అంటే కొన్ని మార్కెట్లలో దాదాపు రెట్టింపు ధరకు చేరింది.

నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కౌన్సిల్ (ఇండియా) అధ్యక్షురాలు గుంజన్ జైన్ మాట్లాడుతూ, గత దీపావళితో పోలిస్తే బాదం ధరలు సుమారు 35 శాతం పెరిగాయని, పిస్తా ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ఆస్ట్రేలియా, అమెరికాలో పంట దిగుబడులు తగ్గడం, పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా రవాణా ఖర్చులు పెరగడం ఈ ధరల పెరుగుదలకు కారణమని వివరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 7:19 am Digital Edition : Prabhanews
Diwali Shopping: ఈసారి దీపావళి పండుగ ఖర్చు తడిసి మోపెడే.. ఒక్కసారిగా భారీగా పెరిగిన ధరలు? | బిజినెస్

మనీకంట్రోల్ వెల్లడించిన కథనం ప్రకారం.. ఈ ఏడాది టీవీలు, ఏసీలు, ఇతర గృహోపకరణాల ధరలు సుమారు 3 నుంచి 7 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైయర్, ఎల్‌జీ, బ్లూ స్టార్ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. సాధారణంగా దీపావళి సమయంలో కంపెనీలు ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తాయి. దీంతో కొత్త వస్తువులు కొనాలనుకునే వినియోగదారులకు కొంత ఊరట లభిస్తుంది. కానీ ఈసారి ఉత్పత్తుల ధరల పెరుగుదల కారణంగా ఆఫర్లు ఉన్నప్పటికీ కొనుగోలుదారులు గతం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది.ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ విజయ్ సేల్స్ ఈ పండుగ సీజన్‌లో అమ్మకాల మొత్తం విలువలో 20 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. అయితే విక్రయించే వస్తువుల సంఖ్య మాత్రం ఒకే అంకెల వృద్ధికే పరిమితం కావచ్చని భావిస్తోంది. దీనిపై సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిలేష్ గుప్తా మాట్లాడుతూ, వినియోగదారులు ఈఎంఐల ద్వారా కొనుగోళ్లు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. తమ సంస్థలో జరిగే కొనుగోళ్లలో దాదాపు 70 శాతం ఈఎంఐల ద్వారానే జరుగుతున్నాయని చెప్పారు. పండుగ సీజన్ సానుకూలంగా ఉన్నప్పటికీ, అమ్మకాల విలువ పెరిగినంత స్థాయిలో వస్తువుల సంఖ్య పెరగకపోవచ్చని వివరించారు.సెలెకార్ గాడ్జెట్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రవి అగర్వాల్ కూడా ఈ ఏడాది చిన్న, పెద్ద గృహోపకరణాల విభాగాల్లో కొన్ని సవాళ్లు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం వినియోగదారులు ఏ వస్తువు కొనాలన్నా ముందుగా దాని ధర, ఫీచర్లు, నాణ్యత, ఇతర కంపెనీల ఉత్పత్తులతో పోలికలను పరిశీలిస్తున్నారని తెలిపారు. తమ డబ్బుకు తగిన విలువ వచ్చే ఉత్పత్తినే ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు.భారీగా పెరిగిన స్వీట్ల ధరలు?దీపావళి సమయంలో స్వీట్లు, సంప్రదాయ వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఈసారి వాటి ధరలు కూడా వినియోగదారులకు భారంగా మారాయి. పాలు, కోవా, చక్కెర, డ్రై ఫ్రూట్స్‌తో పాటు ప్యాకేజింగ్ సామగ్రి ధరలు పెరగడంతో మిఠాయిల తయారీ ఖర్చు అధికమైంది. ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో చక్కెర ధర క్వింటాల్‌కు రూ.4,800 నుంచి రూ.5,700కు పెరిగింది. కర్ణాటకలో నందిని పాల ధరను లీటరుకు రూ.8 పెంచేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ పరిణామాలు స్వీట్ల ధరలపై ప్రభావం చూపుతున్నాయి.ఢిల్లీలోని ప్రముఖ స్వీట్ షాప్ చైన్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, పండుగ సమయంలో మిఠాయిలు, సంప్రదాయ వంటకాలకు డిమాండ్ తగ్గదని చెప్పారు. అయితే ధరలు పెరగడంతో వినియోగదారులు పెద్ద ప్యాకెట్లకు బదులుగా చిన్న ప్యాకెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. దీపావళికి కొద్ది రోజుల ముందు తమ సంస్థ ధరలను సుమారు 15 శాతం పెంచినట్లు వెల్లడించారు. జైపూర్‌కు చెందిన త్యోహార్ స్వీట్స్ యజమాని అంజలి జైన్ కూడా ఈ ఏడాది మిఠాయిల ధరలను 10 నుంచి 12 శాతం వరకు పెంచాల్సి వచ్చిందని తెలిపారు. పాలు, చక్కెర, డ్రై ఫ్రూట్స్‌తో పాటు స్వీట్లపై ఉపయోగించే వెండి అలంకరణ, ప్యాకేజింగ్ ఖర్చులు కూడా పెరిగాయని చెప్పారు. ఖర్చులు తగ్గించుకునేందుకు కొన్ని దుకాణాలు గిఫ్ట్ హ్యాంపర్లలో డ్రై ఫ్రూట్స్‌కు బదులుగా వివిధ రకాల విత్తనాల మిశ్రమాలను ఉపయోగిస్తున్నాయని వివరించారు.పిస్తా, బాదం ధరలు భారీగా పెరిగాయ్దీపావళి గిఫ్ట్ ప్యాకెట్లు, స్వీట్ల తయారీలో ఉపయోగించే డ్రై ఫ్రూట్స్ ధరలు కూడా ఈసారి గణనీయంగా పెరిగాయి. గత ఏడాది దీపావళి సమయంలో కిలో బాదం ధర రూ.800 నుంచి రూ.900 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.1,000 నుంచి రూ.1,200కు చేరింది. పిస్తా ధర మరింత ఎక్కువగా పెరిగింది. గత ఏడాది కిలో రూ.900కు లభించిన పిస్తా ఇప్పుడు రూ.1,500 నుంచి రూ.2,100 వరకు పలుకుతోంది. అంటే కొన్ని మార్కెట్లలో దాదాపు రెట్టింపు ధరకు చేరింది.నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కౌన్సిల్ (ఇండియా) అధ్యక్షురాలు గుంజన్ జైన్ మాట్లాడుతూ, గత దీపావళితో పోలిస్తే బాదం ధరలు సుమారు 35 శాతం పెరిగాయని, పిస్తా ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ఆస్ట్రేలియా, అమెరికాలో పంట దిగుబడులు తగ్గడం, పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా రవాణా ఖర్చులు పెరగడం ఈ ధరల పెరుగుదలకు కారణమని వివరించారు.

Source link