Last Updated:
Crude Oil Prices: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. సౌదీ అరేబియాలో కీలక ఇంధన మౌలిక వసతులపై దాడులు, హార్ముజ్ జలసంధిలో నౌకారవాణాపై ఆందోళనలతో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ద్రవ్యోల్బణంపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
మధ్యప్రాచ్యంలో సైనిక ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో పాటు సౌదీ అరేబియాలోని కీలక ఇంధన మౌలిక వసతులపై వరుస దాడులు జరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఒక్కసారిగా మండాయి. సౌదీ అరేబియాకు చెందిన ప్రధానమైన ‘ఈస్ట్-వెస్ట్’ (East-West) పైప్‌లైన్ కార్యకలాపాలు నిలిచిపోవడం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నౌకారవాణా భద్రతపై ఆందోళనలు పెరగడంతో ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.

