Last Updated:
Jivan Mithari: తరగతి గదిలో వందల మంది విద్యార్థులు ఉంటేనే పాఠాలు చెప్పడానికి కొందరు ఉపాధ్యాయులు వెనుకాడుతున్న ఈ రోజుల్లో.. కేవలం ఒక్క విద్యార్థి కోసం దట్టమైన అడవిలో రోజూ 5 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు.
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 13 ఏళ్లుగా వర్షం, కొండకోనలు, క్రూరమృగాల భయాన్ని లెక్కచేయకుండా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్న ఆ ఉపాధ్యాయుడి పేరు జీవన్ మిథారి (55). మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా గగన్‌బవాడా తాలూకా కవాల్‌తేక్ ధన్‌గర్‌వాడ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ స్ఫూర్తిదాయక ఘటన వెలుగుచూసింది.

