Last Updated:
Cheating Bride: చాలా మందికి ఒక పెళ్లి అవ్వడమే కష్టంగా ఉన్న రోజులు ఇవి. అలాంటిది ఆమె ఐదు పెళ్లిళ్లు చేసుకోవడమే కాదు.. ఎదురుకట్నం తీసుకునేది. అంతలా ఆమెకు భారీగా డబ్బు సమర్పించుకొని మోసపోయారు ఐదుగురు. అసలు ఈ తంతు ఎలా జరిగిందో తెలుసుకుందాం.
అనంతపురం జిల్లా.. పెదవడుగూరు పోలీసులు ఓ యువతిని అరెస్టు చేశాక.. ఆమె పేరు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆమె అసలు పేరు వజ్రపు మణి. అదే చిత్రంగా ఉంది అనుకుంటే.. ఆమెకు మరిన్ని డూప్లికేట్ పేర్లు ఉన్నాయని అర్థమైంది. కీర్తి, శ్వేతా రెడ్డి.. ఇలా.. ఒక్కో వరుడి దగ్గర ఒక్కో పేరుతో చెలామణీ అవుతూ.. మగాళ్లను ముంచేస్తోంది ఆ 27 ఏళ్ల మణి. కానీ.. ఇలాంటి మోసాలకు ఎప్పుడోకప్పుడు చెక్ తప్పదు. ఆమె విషయంలో అదే జరిగింది. మదనపల్లె మండలం చీలకబైలు దగ్గర పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ప్రశ్నించినప్పుడు షాకింగ్ విషయాలు తెలిశాయి.
ఈజీగా మనీ సంపాదించడం ఎలా అని విజయవాడకు చెందిన అశోక్, శశికళ, సుమప్రియ ఆలోచించారు. ఇందుకోసం ఓ అందమైన అమ్మాయి దొరికితే.. చాలు.. ఆటాడుకోవచ్చు అని అనుకున్నారు. అదుకోసం వెతికితే.. ఈ మణి వారి కంట పడింది. ఈమె పశ్చిమ గోదావరి జిల్లా.. దొండపూడికి చెందినది. ఆమెుకు విషయం చెప్పారు. భారీగా మనీ, నగలు లాగొచ్చని ఆశచూపారు. ప్రతీ నెలా లక్షలు సంపాదించవచ్చు అని ఆశ రేపారు. మణికి ఇదేదో బాగుంది.. చేస్తే పోలా అని అనుకుంది. చేతులు కలిపింది.
ఈ బ్యాచ్.. మణికి మధ్యవర్తులలా నటిస్తూ.. ఆమెకు పెళ్లి సంబంధాలు తెచ్చేవారు. చాలా ఏళ్లుగా పెళ్లి అవ్వక.. ఎవరో ఒకరు దొరికితే, చేసేసుకుందాం అని ఎదురుచూసే వారిని వీరు వెతికేవారు. ఎదురుకట్నం ఇవ్వాలని కోరేవారు. మణికి ఆల్రెడీ మూడు సంబంధాలు క్యూలో ఉన్నాయని చెప్పేవారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని తొందరపెట్టేవారు. దాంతో.. అందమైన అమ్మాయి భార్యగా వస్తే.. ఆనందమే అనుకుంటూ.. బాధితులు.. పెళ్లికి ఎదురుకట్నం ఇచ్చి మరీ ఒప్పుకునే వారు.
పెళ్లి తర్వాత మధ్యవర్తులు మాయమయ్యేవారు. ఆ తర్వాత మణి.. మంచిదానిలా నటిస్తూ.. కొన్ని రోజులు అత్తారింట్లోనే ఉండేది. వన్ ఫైన్ నైట్.. మనీ, నగలు, ముఖ్యమైన వస్తువులతో ఉడాయించేది. తెల్లారి వరుడు నిద్ర లేస్తే.. దిమ్మ తిరిగే షాకింగ్ న్యూస్. ఇలా.. ఐదుగురు మగాళ్లను ముంచేసింది మణి. పారిపోయిన తర్వాత మణి.. తన మధ్యవర్తులను కలిసేది.. వారు మరో సంబంధం తెచ్చేవారు. మళ్లీ డ్రామా మొదలు.
2025లో పెద్దవడుగూరు మండలం కాసేపల్లికి చెందిన సుధీర్‌రెడ్డిని పెళ్లి చేసుకుంది మణి. మంచి అమ్మాయి తన జీవితంలోకి వచ్చిందని ఆయన ఎంతో ఆనందపడ్డారు. కానీ.. కొన్ని రోజులకే మణి.. మాయమైంది. మతిపోయేలా చేసింది. సుధీర్ రెడ్డికి ఆస్తి నష్టం మాత్రమే కాదు.. పరువు నష్టం కూడా కలిగింది. చుట్టుపక్కల వారంతా నలుగురూ.. నాలుగు రకాలుగా మాట్లాడుకున్నారు. ఆయన.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఆమె గురించి.. అన్ని పోలీస్ స్టేషన్లకూ కంప్లైంట్ వెళ్లింది. దాంతో పోలీసులు ఆమె కోసం వేట మొదలుపెట్టారు.
ఇలాంటి సమయంలో.. కర్ణాటకలో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది మణి. అక్కడ కూడా 6 రోజులు ఉండి.. ఉదయాన్నే ఉడాయించింది. ఆ రాష్ట్రం నుంచి ఏపీకి వచ్చింది. మదనపల్లెకు వెళ్లేందుకు రెడీ అయ్యింది. అప్పుడే చీకలబైలు దగ్గర పోలీసులు ఆమెను చూశారు. అమె అనుమానాస్పదంగా దాక్కుంటూ ఉండటాన్ని చూశారు. ఏ తప్పూ చెయ్యకపోతే, ఎందుకు అలా చేస్తుంది అనే డౌట్ వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకొని పరిశీలించగా.. ఆమె నిత్య పెళ్లి కూతురు కావచ్చు అనే డౌట్ వచ్చింది. రికార్డుల్లో చూడగా.. వారికి వచ్చిన ఫొటో ఆమెదేనని అర్థమైంది. దాంతో.. తాము కనిపెట్టింది మామూలు మహిళ కాదనీ.. పెద్ద కిలాడీ అని పోలీసులకు అర్థమైంది. ఆమెను అరెస్టు చేసి.. అన్ని పోలీస్ స్టేషన్లకూ సమాచారం పంపారు. ఇలా.. మగాళ్లను ముంచేస్తున్న నిత్యపెళ్లికూతురికి చెక్ పెట్టారు పోలీసులు.
Hyderabad,Telangana

