Renault Triber: ఇది దాని కాంపాక్ట్ సైజ్ , అద్భుతమైన స్పేస్ మేనేజ్మెంట్కు ప్రసిద్ధి చెందింది. దీని స్పోర్టీ డిజైన్, మస్కులర్ బాడీ క్లాడింగ్ , రూఫ్ రైల్స్ దీనికి SUV లాంటి రూపాన్ని ఇస్తాయి. ఇంటీరియర్లో డ్యూయల్-టోన్ డాష్బోర్డ్, 7-సీటర్ లేఅవుట్ ఉన్నాయి. ఇందులో మూడవ వరుసలోని ‘ఈజీఫిక్స్’ సీట్లను పూర్తిగా తొలగించవచ్చు. ముఖ్యమైన ఫీచర్లలో 8-అంగుళాల టచ్స్క్రీన్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్-స్టాప్, వెనుక AC వెంట్లు, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, వినోదాత్మకంగా చేస్తాయి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5,80,875.
