Last Updated:
Regina Cassandra: హీరోయిన్ రెజీనా కసాండ్రా తన ప్రేమ విఫలంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 2020లో ప్రేమించిన వ్యక్తే తనను దారుణంగా మోసం చేసి వెన్నుపోటు పొడిచాడని, లాక్డౌన్ సమయంలో సెల్ఫ్-లవ్ నేర్చుకుని ఆ డిప్రెషన్ నుండి బయటపడ్డానని వెల్లడించింది.
Regina Cassandra: టాలీవుడ్లో ‘శివ మనసులో శృతి’, ‘రొటీన్ లవ్ స్టోరీ’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘ఎవరు’ లాంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అందాల తార రెజీనా కసాండ్రా. హీరోయిన్గా మెప్పించడమే కాకుండా.. రీసెంట్గా విలన్ రోల్స్‌లో కూడా నటిస్తూ తన మార్క్ చూపిస్తోంది. అయితే ఎప్పుడూ నవ్వుతూ సరదాగా కనిపించే ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్రమైన విషాదం దాగి ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా.. తన జీవితంలో ఎదురైన ప్రేమ వైఫల్యం, నమ్మిన వ్యక్తే చేసిన ద్రోహం గురించి ఓపెన్ అయి సంచలన విషయాలు బయటపెట్టింది. ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
2020లో బ్రేకప్.. తన ప్రేమ జీవితం గురించి చెబుతూ రెజీనా తీవ్ర భావోద్వేగానికి గురైంది. “2020 సంవత్సరంలో నా ప్రేమ బంధం ముగిసింది. ఆ బంధంలో నేను దారుణంగా మోసపోయాను. ప్రాణంగా ప్రేమించి నమ్మిన మనిషే నన్ను నిలువునా వెన్నుపోటు పొడవడంతో నా మనసు ముక్కలైపోయింది. ఆ మోసం నుంచి బయటపడటానికి చాలా కాలం పట్టింది. ఆ సమయంలో నేను అనుభవించిన మానసిక నరకాన్ని మాటల్లో వర్ణించలేను” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
లాక్డౌన్ నాకు వరంగా మారింది: ప్రేమలో మోసపోయిన తర్వాత కొంతకాలం పాటు ఎలాంటి రిలేషన్షిప్లలోకి వెళ్లకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. “నా ఆలోచనలను, నా సమయాన్ని పూర్తిగా నా కోసమే కేటాయించుకోవాలని ఫిక్స్ అయ్యాను. సరిగ్గా అదే టైమ్‌లో కరోనా లాక్డౌన్ మొదలైంది. ఆ సమయం నాకు నిజంగా ఒక వరంలా మారింది. బయటి ప్రపంచానికి దూరంగా ఉంటూ నన్ను నేను ప్రేమించుకోవడం నేర్చుకున్నాను. ఆ క్లిష్ట పరిస్థితుల్లో నాకు నేను ఇచ్చుకున్న ధైర్యమే ఇప్పుడు నన్ను ఈ స్థాయి ప్రశాంతతకు చేర్చింది” అని రెజీనా స్పష్టం చేసింది.
విలన్ రోల్స్‌తో కెరీర్లో దూకుడు.. వ్యక్తిగత జీవితంలో అంతటి చేదు ఎదురైనా కుంగిపోకుండా రెజీనా కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల అజిత్ నటించిన భారీ చిత్రం ‘విడాముయర్చి’లో నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ చేసి ప్రశంసలు అందుకున్న ఈమె.. నయనతార లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ మూవీ ‘మహాశక్తి’లోనూ పవర్ఫుల్ విలన్‌గా కనిపించి థియేటర్లలో రఫ్ఫాడిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్లో మధుర్ భండార్కర్ డైరెక్షన్లో వస్తున్న ‘ది వైవ్స్’ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. మోసం చేసినోడిని తలచుకుని ఏడవడం మానేసి.. తన కాళ్లపై తాను నిలబడి సరికొత్త ప్రయోగాలతో దూసుకుపోతున్న రెజీనా ధైర్యాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు!

