Last Updated:
BRICS Summit 2026: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం వేకువజామున దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు.
భారత్ ఆతిథ్యమిస్తున్న 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతో పాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. విమానాశ్రయంలో రష్యా అధ్యక్షుడికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సాదర స్వాగతం పలికారు. ఈ పర్యటన కోసం పుతిన్ ఉన్నత స్థాయి రష్యా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, రష్యా వెలుపల పుతిన్ స్వయంగా హాజరవుతున్న తొలి బ్రిక్స్ సదస్సు ఇదే కావడం గమనార్హం.

