ఇక BIS అధికారులు కూడా మార్కెట్ పర్యవేక్షణ, ఎన్ఫోర్స్మెంట్ చర్యలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నాసిరకం లేదా నిబంధనలకు అనుగుణంగా లేని ఉత్పత్తుల విక్రయాలను అరికట్టడం, BIS స్టాండర్డ్ మార్క్, హాల్మార్క్ దుర్వినియోగాన్ని నియంత్రించడం, వినియోగదారుల్లో హాల్మార్కింగ్ వ్యవస్థపై నమ్మకాన్ని కొనసాగించడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశాల్లో ఉన్నాయి. తాజాగా అంబత్తూర్లో జరిగిన స్వాధీనం కూడా ఈ పర్యవేక్షణలో భాగంగా చూడవచ్చు. అందుకే ఇకపై బంగారు నగలు కొనేటప్పుడు డిజైన్, ధర, మేకింగ్ ఛార్జీలతో పాటు హాల్మార్క్పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి. BIS లోగో ఉందా? స్వచ్ఛత గుర్తు ఉందా? ఆరు అంకెల HUID నంబర్ ఉందా? ఆ HUIDను BIS Care యాప్లో వెరిఫై చేశారా? సరైన బిల్లు తీసుకున్నారా? అనే నాలుగు విషయాలను తప్పనిసరిగా చెక్ చేయండి. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ బంగారు ఆభరణం స్వచ్ఛత, గుర్తింపు విషయంలో మరింత భద్రత పొందవచ్చు.

