RBI 2006లో స్టార్ సిరీస్ నోట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభ దశలో ₹10, ₹20, ₹50 నోట్లలో ఈ విధానాన్ని ఉపయోగించేందుకు RBI చర్యలు తీసుకుంది. ప్రింటింగ్ సమయంలో లోపాలు వచ్చిన నోట్ల స్థానంలో రీప్లేస్మెంట్ నోట్లను సులభంగా గుర్తించేందుకు ఈ విధానం తీసుకొచ్చారు. అప్పటి నుంచి వివిధ సందర్భాల్లో స్టార్ గుర్తుతో ఉన్న నోట్లు చలామణిలోకి వచ్చాయి. అయితే స్టార్ గుర్తు ఉన్న నోటు, నకిలీ నోటు మధ్య తేడాను ప్రజలు తప్పనిసరిగా గుర్తించాలి. నకిలీ నోటును గుర్తించడానికి కేవలం సీరియల్ నంబర్‌ను చూడటం సరిపోదు. నోటుపై ఉన్న వాటర్‌మార్క్, సెక్యూరిటీ థ్రెడ్, అక్షరాలు, ముద్రణ నాణ్యత, రంగు మార్పులు వంటి భద్రతా లక్షణాలను కూడా పరిశీలించాలి. అనుమానాస్పదంగా కనిపించే నోటు ఉంటే దాన్ని మరొకరికి చెలామణి చేయకుండా బ్యాంకు సిబ్బందిని సంప్రదించడం మంచిది.

