బోనాల పండుగ అంటే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలతో పాటు హైదరాబాద్ జంటనగరాల పరిధిలో అత్యంత వైభవంగా జరుపుకునే సాంప్రదాయ పండుగ. గ్రామదేవతలుగా కొలిచే పోచమ్మ, ఎల్లమ్మ, మహంకాళిని ఆషాఢ మాసంలో పూజిస్తారు. మహిళలు కొత్త కుండలలో వండిన నైవేద్యం (బోనం), పసుపు కుంకుమ, చీరసారెలను సమర్పిస్తారు.

