ప్రభన్యూస్

Blood Donation Myths: రక్తం ఇస్తే బరువు పెరుగుతారా? డాక్టర్ చెప్పిన ఈ నిజం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు! | లైఫ్ స్టైల్


Last Updated:

బీపీ, షుగర్ ఉంటే రక్తదానం చేయొచ్చా? బ్లడ్ డొనేట్ చేస్తే ఏం అవుతుంది? డాక్టర్ చెపిన వివరాలు ఇవే.

+

News18

News18

సమాజ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. వారి స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మానవత్వం వెల్లివిరిసింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం మహా లింగేశ్వర్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే చేతుల మీదుగా ప్రారంభమైన ఈ శిబిరంలో పోలీసు అధికారులు, సిబ్బంది, యువత, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు ఇలా మొత్తం 400 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలోనే కాకుండా సామాజిక సేవలోనూ పోలీస్ శాఖ ముందుండటం అభినందనీయమన్నారు. దేశ రక్షణ కోసం సెలవులు లేకుండా నిరంతరం శ్రమిస్తూ, ఆపదలో ఉన్న ప్రజలకు పోలీసులు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజల్లో భరోసా కల్పిస్తున్నారని, అయితే ఈ స్నేహపూర్వక వాతావరణం కేవలం ప్రజల కోసమేనని, నేరస్తుల పట్ల కఠినంగానే ఉంటామని స్పష్టం చేశారు. ‘అరైవ్ అలైవ్’ ద్వారా రోడ్డు భద్రతపై, అలాగే మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పిస్తూ సురక్షిత సమాజ నిర్మాణానికి పోలీసులు విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: PM Kisan Money: రైతులకు భారీ గుడ్ న్యూస్.. బ్యాంక్ అకౌంట్లలోకి రూ.2 వేలు పడేది ఆరోజే, పీఎం కిసాన్ డబ్బులపై కీలక ప్రకటన!

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుంచి జిల్లా వ్యాప్తంగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఏ ఒక్కరి ప్రాణం ప్రమాదంలో పడకూడదనే ఉద్దేశంతోనే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రక్తదానం అనేది ఎంతో విలువైన సామాజిక సేవ అని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రక్తదానం చేసిన దాతలందరికీ ప్రశంసాపత్రాలు, డోనర్ కార్డులు అందజేశారు.

ఇది కూడా చదవండి: Sewing Machine Scheme: మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు ఇచ్చేది ఆ రోజే.. ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

రక్తదానం ప్రాముఖ్యతను కరీంనగర్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం.ఎల్.ఎన్. రెడ్డి వివరించారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని హెచ్‌ఐవీ, హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి, వీడీఆర్‌ఎల్‌, మలేరియా తదితర పరీక్షలు చేసిన తర్వాతే అవసరమైన రోగులకు అందిస్తామని తెలిపారు. రక్తదాతలకు అందించే డోనర్‌ కార్డు ద్వారా ఏడాది లోపు దాతకు లేదా వారి కుటుంబ సభ్యులకు అత్యవసర సమయంలో నిబంధనల ప్రకారం ఒక యూనిట్‌ రక్తం ఉచితంగా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజలు అపోహలు వీడి ముందుకు రావాలని ఆయన సూచించారు.

రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలపై న్యూస్18 ప్రతినిధి హరి అడిగిన ప్రశ్నకు డాక్టర్ ఎం.ఎల్.ఎన్. రెడ్డి బదులిచ్చారు. రక్తం ఇస్తే శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందని, బరువు పెరుగుతారనేది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. రక్తదానం చేయడం వల్ల బీపీ, షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయని, దాతకు ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇచ్చారు. మనిషి శరీరంలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుందని, కానీ ఆరోగ్యంగా జీవించడానికి 4 నుంచి 5 లీటర్లు సరిపోతుందని వివరించారు. ఈనాటి రక్తదాతే రేపటి ప్రాణదాత అని పేర్కొంటూ భవిష్యత్తులో ఇలాంటి రక్తదాన శిబిరాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 October 2026, 9:38 am Digital Edition : Prabhanews
Blood Donation Myths: రక్తం ఇస్తే బరువు పెరుగుతారా? డాక్టర్ చెప్పిన ఈ నిజం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 28, 2026 9:26 AM ISTబీపీ, షుగర్ ఉంటే రక్తదానం చేయొచ్చా? బ్లడ్ డొనేట్ చేస్తే ఏం అవుతుంది? డాక్టర్ చెపిన వివరాలు ఇవే. +
News18సమాజ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. వారి స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మానవత్వం వెల్లివిరిసింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం మహా లింగేశ్వర్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే చేతుల మీదుగా ప్రారంభమైన ఈ శిబిరంలో పోలీసు అధికారులు, సిబ్బంది, యువత, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు ఇలా మొత్తం 400 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలోనే కాకుండా సామాజిక సేవలోనూ పోలీస్ శాఖ ముందుండటం అభినందనీయమన్నారు. దేశ రక్షణ కోసం సెలవులు లేకుండా నిరంతరం శ్రమిస్తూ, ఆపదలో ఉన్న ప్రజలకు పోలీసులు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజల్లో భరోసా కల్పిస్తున్నారని, అయితే ఈ స్నేహపూర్వక వాతావరణం కేవలం ప్రజల కోసమేనని, నేరస్తుల పట్ల కఠినంగానే ఉంటామని స్పష్టం చేశారు. 'అరైవ్ అలైవ్' ద్వారా రోడ్డు భద్రతపై, అలాగే మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పిస్తూ సురక్షిత సమాజ నిర్మాణానికి పోలీసులు విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు.ఇది కూడా చదవండి: PM Kisan Money: రైతులకు భారీ గుడ్ న్యూస్.. బ్యాంక్ అకౌంట్లలోకి రూ.2 వేలు పడేది ఆరోజే, పీఎం కిసాన్ డబ్బులపై కీలక ప్రకటన!జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుంచి జిల్లా వ్యాప్తంగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఏ ఒక్కరి ప్రాణం ప్రమాదంలో పడకూడదనే ఉద్దేశంతోనే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రక్తదానం అనేది ఎంతో విలువైన సామాజిక సేవ అని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రక్తదానం చేసిన దాతలందరికీ ప్రశంసాపత్రాలు, డోనర్ కార్డులు అందజేశారు.ఇది కూడా చదవండి: Sewing Machine Scheme: మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు ఇచ్చేది ఆ రోజే.. ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రభుత్వం!రక్తదానం ప్రాముఖ్యతను కరీంనగర్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం.ఎల్.ఎన్. రెడ్డి వివరించారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని హెచ్‌ఐవీ, హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి, వీడీఆర్‌ఎల్‌, మలేరియా తదితర పరీక్షలు చేసిన తర్వాతే అవసరమైన రోగులకు అందిస్తామని తెలిపారు. రక్తదాతలకు అందించే డోనర్‌ కార్డు ద్వారా ఏడాది లోపు దాతకు లేదా వారి కుటుంబ సభ్యులకు అత్యవసర సమయంలో నిబంధనల ప్రకారం ఒక యూనిట్‌ రక్తం ఉచితంగా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజలు అపోహలు వీడి ముందుకు రావాలని ఆయన సూచించారు.రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలపై న్యూస్18 ప్రతినిధి హరి అడిగిన ప్రశ్నకు డాక్టర్ ఎం.ఎల్.ఎన్. రెడ్డి బదులిచ్చారు. రక్తం ఇస్తే శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందని, బరువు పెరుగుతారనేది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. రక్తదానం చేయడం వల్ల బీపీ, షుగర్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయని, దాతకు ఎలాంటి నష్టం ఉండదని భరోసా ఇచ్చారు. మనిషి శరీరంలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుందని, కానీ ఆరోగ్యంగా జీవించడానికి 4 నుంచి 5 లీటర్లు సరిపోతుందని వివరించారు. ఈనాటి రక్తదాతే రేపటి ప్రాణదాత అని పేర్కొంటూ భవిష్యత్తులో ఇలాంటి రక్తదాన శిబిరాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు.మరింత చదవండి

Source link