ప్రభన్యూస్

OTT: ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్రవనం పీఎస్’ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా మాములుగా లేదు. అసలు వీకెండ్ వచ్చిందంటే చాలు థియేటర్‌లో కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అనే దానికంటే కూడా ఓటీటీలో కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అని తెగ వేయిట్ చేస్తుంటారు.

News18
News18

ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా మాములుగా లేదు. అసలు వీకెండ్ వచ్చిందంటే చాలు థియేటర్‌లో కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అనే దానికంటే కూడా ఓటీటీలో కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అని తెగ వేయిట్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా కంటెంట్ నచ్చితే 5, 6 గంటల వెబ్ సిరీస్‌లను కూడా ఒక్క సిట్టింగ్‌లోనే లేపేస్తున్నారు. అలాంటి క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. అదే ‘రుద్రవనం పీఎస్’. శశిధర్ మున్నంగి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సిరీస్‌ను ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్‌లపై రమేష్ పుప్పాల, సూర్యకాంతి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు.

ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ నిర్మాత రమేష్ పుప్పాల తనను ‘మిరపకాయ్’ సినిమా సమయంలో ఎంతో ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. ఆయనను మళ్లీ ఇలా కలవడం ఆనందంగా ఉందన్నారు. రాజా రవీంద్ర అందించిన సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. అలాగే వివేక్ కూచిభొట్ల తన కుటుంబ సభ్యుడిలాంటి వారని పేర్కొన్నారు. వివేక్ గారి సతీమణి సూర్యకాంతి ఈ సిరీస్‌తో నిర్మాతగా రావడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు శశిధర్ మున్నంగి ఈ ప్రాజెక్ట్‌తో గొప్ప విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ‘రుద్రవనం పీఎస్’ కంటెంట్‌ను తాను చూశానని, ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

నటుడు నరేష్ అగస్త్య మాట్లాడుతూ జీ5తో తనకు పన్నెండేళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఈ ఓటీటీ వేదికపై ‘పసుపు కుంకుమ’తో తన ప్రయాణం ప్రారంభమైందని, ఆ తర్వాత ‘పరువు’, ‘వికటకవి’ వంటి ప్రాజెక్టుల్లో నటించానని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ‘రుద్రవనం పీఎస్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. తనను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలు సూర్యకాంతి, రమేష్ పుప్పాలకు కృతజ్ఞతలు చెప్పారు. దర్శకుడు శశిధర్ వద్ద ఇంకా ఎన్నో మంచి కథలు ఉన్నాయని, ఈ సిరీస్ కోసం శశి, అష్కర్ ఎంతో కష్టపడ్డారని వెల్లడించారు. ఇందులో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారని పేర్కొంటూ, ప్రేక్షకులు తప్పకుండా సిరీస్‌ను చూడాలని కోరారు.

దర్శకుడు శశిధర్ మున్నంగి మాట్లాడుతూ ‘రుద్రవనం పీఎస్’ను ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు తెలిపారు. ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని, ఎక్కడా బోర్ కొట్టకుండా కథనం సాగుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌కు సహకరించిన జీ5 బృందానికి, నిర్మాతలకు, నటీనటులకు కృతజ్ఞతలు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 October 2026, 10:26 am Digital Edition : Prabhanews
OTT: ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్రవనం పీఎస్’ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 29, 2026 10:21 AM ISTఈ మధ్య కాలంలో ఓటీటీల హవా మాములుగా లేదు. అసలు వీకెండ్ వచ్చిందంటే చాలు థియేటర్‌లో కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అనే దానికంటే కూడా ఓటీటీలో కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అని తెగ వేయిట్ చేస్తుంటారు. News18ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా మాములుగా లేదు. అసలు వీకెండ్ వచ్చిందంటే చాలు థియేటర్‌లో కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అనే దానికంటే కూడా ఓటీటీలో కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అని తెగ వేయిట్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా కంటెంట్ నచ్చితే 5, 6 గంటల వెబ్ సిరీస్‌లను కూడా ఒక్క సిట్టింగ్‌లోనే లేపేస్తున్నారు. అలాంటి క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. అదే 'రుద్రవనం పీఎస్'. శశిధర్ మున్నంగి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సిరీస్‌ను ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్‌లపై రమేష్ పుప్పాల, సూర్యకాంతి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు.ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ నిర్మాత రమేష్ పుప్పాల తనను ‘మిరపకాయ్’ సినిమా సమయంలో ఎంతో ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. ఆయనను మళ్లీ ఇలా కలవడం ఆనందంగా ఉందన్నారు. రాజా రవీంద్ర అందించిన సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. అలాగే వివేక్ కూచిభొట్ల తన కుటుంబ సభ్యుడిలాంటి వారని పేర్కొన్నారు. వివేక్ గారి సతీమణి సూర్యకాంతి ఈ సిరీస్‌తో నిర్మాతగా రావడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు శశిధర్ మున్నంగి ఈ ప్రాజెక్ట్‌తో గొప్ప విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ‘రుద్రవనం పీఎస్’ కంటెంట్‌ను తాను చూశానని, ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.నటుడు నరేష్ అగస్త్య మాట్లాడుతూ జీ5తో తనకు పన్నెండేళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ఈ ఓటీటీ వేదికపై ‘పసుపు కుంకుమ’తో తన ప్రయాణం ప్రారంభమైందని, ఆ తర్వాత ‘పరువు’, ‘వికటకవి’ వంటి ప్రాజెక్టుల్లో నటించానని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ‘రుద్రవనం పీఎస్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. తనను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలు సూర్యకాంతి, రమేష్ పుప్పాలకు కృతజ్ఞతలు చెప్పారు. దర్శకుడు శశిధర్ వద్ద ఇంకా ఎన్నో మంచి కథలు ఉన్నాయని, ఈ సిరీస్ కోసం శశి, అష్కర్ ఎంతో కష్టపడ్డారని వెల్లడించారు. ఇందులో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారని పేర్కొంటూ, ప్రేక్షకులు తప్పకుండా సిరీస్‌ను చూడాలని కోరారు.దర్శకుడు శశిధర్ మున్నంగి మాట్లాడుతూ ‘రుద్రవనం పీఎస్’ను ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు తెలిపారు. ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని, ఎక్కడా బోర్ కొట్టకుండా కథనం సాగుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌కు సహకరించిన జీ5 బృందానికి, నిర్మాతలకు, నటీనటులకు కృతజ్ఞతలు తెలిపారు.మరింత చదవండి

Source link