భారతీయ ఇళ్లలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. చాలామంది తులసిని భక్తితో పూజించడమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు. తులసి ఆకులతో టీ, కషాయం, గోరువెచ్చని నీరు తయారు చేసుకుని తీసుకుంటారు. అయితే కొన్ని కుటుంబాల్లో తులసి ఆకులను నేరుగా పళ్లతో నమలకూడదనే సంప్రదాయం ఉంది. దీని వెనుక మతపరమైన విశ్వాసాలు ఉండగా, పళ్లతో నమలడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందనే వాదనకు బలమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని చెప్పలేం.

