ప్రభన్యూస్

Bigg Boss 10: బీ అండ్ పీ అంటూ పచ్చిబూతులు, వర్షిణిపై అపూర్వ డైరెక్ట్ అటాక్.. దుమారం రేపిన ఎపిసోడ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ ప్రక్రియతో వాతావరణం వేడెక్కుతుంది. అయితే, ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్, వర్షిణిపై అపూర్వ డైరెక్ట్ అటాక్ హైలైట్ అయ్యాయి.

News18
News18

రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ ప్రక్రియతో వాతావరణం వేడెక్కుతుంది. అయితే, ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్‌ను తిరిగి రప్పించి, వారి చేత ప్రస్తుత కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయించి సరికొత్త డ్రామాకు తెరతీశారు. ఒక్కొక్కరుగా హౌస్‌లోకి అడుగుపెట్టిన మాజీ కంటెస్టెంట్స్ తమ టార్గెట్స్ పై విరుచుకుపడటంతో ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

ముందుగా హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన షాలిని.. నీతూను టార్గెట్ చేసింది. నీతూ ఒక పిరికిదానివని, ఫిజికల్ టాస్కులు ఆడటంలో పూర్తిగా విఫలమయ్యావని ఆరోపిస్తూ నామినేట్ చేసింది. అనంతరం హౌస్ నుంచి రూ. 15 లక్షల బ్రీఫ్‌కేస్‌తో అనూహ్యంగా వెళ్లిపోయిన మిథిలేష్ రాక అందరినీ ఆశ్చర్యపరిచింది. మిథిలేష్ నేరుగా ముకేశ్‌ను నామినేట్ చేస్తూ బుల్లెట్ల లాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆత్మగౌరవాన్ని సైతం పక్కనపెట్టి రోహిత్‌తో డీల్ కుదుర్చుకోవడంపై నిలదీశాడు. ఝాన్సీని సేవ్ చేసే అవకాశం చేతిలో ఉన్నప్పటికీ కేవలం తన స్వార్థం కోసమే ఆమెను వదిలేశాడని, వర్షిణిని కాపాడేందుకే ఝాన్సీని బలి చేశాడంటూ మిథిలేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య గట్టి వాగ్వాదం చోటుచేసుకుంది.

ఆ తర్వాత వచ్చిన దక్షి సైతం నీతూనే నామినేట్ చేసింది. అయితే, ఈ ఎపిసోడ్ కే హైలైట్‌గా అపూర్వ ఎంట్రీ నిలిచింది. తనదైన యాటిట్యూడ్‌తో అడుగుపెట్టిన అపూర్వ.. వర్షిణిపై బాంబు పేల్చింది. “గత 10 వారాలుగా హౌస్‌లో ఏ పనీ చేయకుండా తేరగా తింటూ కూర్చున్న వ్యక్తిని నామినేట్ చేస్తున్నాను. ఆమెకు ఫిజికల్ టాస్కులు అంటే భయం, పైగా ‘బీ అండ్ పీ’ (B and P) అంటూ బూతులు మాట్లాడుతుంది.. ఆవిడే వర్షిణి” అంటూ అపూర్వ రెచ్చిపోయింది. వ్యక్తిత్వాన్ని (పర్సనాలిటీ) బేస్ చేసుకుని సాగే బిగ్ బాస్ లాంటి షోలో ఇలాంటి పదజాలం వాడటం ఏంటని దుమ్మెత్తిపోసింది. వర్షిణికి కనీసం ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఏకధాటిగా పది నిమిషాల పాటు క్లాస్ పీకింది. ఇదే క్రమంలో ముకేశ్‌పై కూడా అపూర్వ తనదైన శైలిలో సెటైర్లు వేసింది.

చివరగా హౌస్‌లోకి వచ్చిన ఝాన్సీ.. దేబ్జానీని నామినేట్ చేసి వెళ్లిపోయింది. మొత్తానికి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ రాకతో హౌస్‌లోని సభ్యుల ముఖచిత్రాలు మారిపోయాయి. బయట జరుగుతున్న పరిణామాలు, తమ ఆటతీరుపై మాజీ కంటెస్టెంట్స్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో ప్రస్తుత హౌస్‌మేట్స్ తీవ్ర ఆలోచనలో పడ్డారు. ఈ నామినేషన్స్ ప్రక్రియతో రాబోయే రోజుల్లో హౌస్‌లో మరిన్ని వివాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 1:00 pm Digital Edition : Prabhanews
Bigg Boss 10: బీ అండ్ పీ అంటూ పచ్చిబూతులు, వర్షిణిపై అపూర్వ డైరెక్ట్ అటాక్.. దుమారం రేపిన ఎపిసోడ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 17, 2026 12:47 PM ISTరియాలిటీ షో బిగ్ బాస్ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ ప్రక్రియతో వాతావరణం వేడెక్కుతుంది. అయితే, ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్, వర్షిణిపై అపూర్వ డైరెక్ట్ అటాక్ హైలైట్ అయ్యాయి. News18రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ ప్రక్రియతో వాతావరణం వేడెక్కుతుంది. అయితే, ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్‌ను తిరిగి రప్పించి, వారి చేత ప్రస్తుత కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయించి సరికొత్త డ్రామాకు తెరతీశారు. ఒక్కొక్కరుగా హౌస్‌లోకి అడుగుపెట్టిన మాజీ కంటెస్టెంట్స్ తమ టార్గెట్స్ పై విరుచుకుపడటంతో ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.ముందుగా హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన షాలిని.. నీతూను టార్గెట్ చేసింది. నీతూ ఒక పిరికిదానివని, ఫిజికల్ టాస్కులు ఆడటంలో పూర్తిగా విఫలమయ్యావని ఆరోపిస్తూ నామినేట్ చేసింది. అనంతరం హౌస్ నుంచి రూ. 15 లక్షల బ్రీఫ్‌కేస్‌తో అనూహ్యంగా వెళ్లిపోయిన మిథిలేష్ రాక అందరినీ ఆశ్చర్యపరిచింది. మిథిలేష్ నేరుగా ముకేశ్‌ను నామినేట్ చేస్తూ బుల్లెట్ల లాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆత్మగౌరవాన్ని సైతం పక్కనపెట్టి రోహిత్‌తో డీల్ కుదుర్చుకోవడంపై నిలదీశాడు. ఝాన్సీని సేవ్ చేసే అవకాశం చేతిలో ఉన్నప్పటికీ కేవలం తన స్వార్థం కోసమే ఆమెను వదిలేశాడని, వర్షిణిని కాపాడేందుకే ఝాన్సీని బలి చేశాడంటూ మిథిలేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య గట్టి వాగ్వాదం చోటుచేసుకుంది.ఆ తర్వాత వచ్చిన దక్షి సైతం నీతూనే నామినేట్ చేసింది. అయితే, ఈ ఎపిసోడ్ కే హైలైట్‌గా అపూర్వ ఎంట్రీ నిలిచింది. తనదైన యాటిట్యూడ్‌తో అడుగుపెట్టిన అపూర్వ.. వర్షిణిపై బాంబు పేల్చింది. "గత 10 వారాలుగా హౌస్‌లో ఏ పనీ చేయకుండా తేరగా తింటూ కూర్చున్న వ్యక్తిని నామినేట్ చేస్తున్నాను. ఆమెకు ఫిజికల్ టాస్కులు అంటే భయం, పైగా 'బీ అండ్ పీ' (B and P) అంటూ బూతులు మాట్లాడుతుంది.. ఆవిడే వర్షిణి" అంటూ అపూర్వ రెచ్చిపోయింది. వ్యక్తిత్వాన్ని (పర్సనాలిటీ) బేస్ చేసుకుని సాగే బిగ్ బాస్ లాంటి షోలో ఇలాంటి పదజాలం వాడటం ఏంటని దుమ్మెత్తిపోసింది. వర్షిణికి కనీసం ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఏకధాటిగా పది నిమిషాల పాటు క్లాస్ పీకింది. ఇదే క్రమంలో ముకేశ్‌పై కూడా అపూర్వ తనదైన శైలిలో సెటైర్లు వేసింది.చివరగా హౌస్‌లోకి వచ్చిన ఝాన్సీ.. దేబ్జానీని నామినేట్ చేసి వెళ్లిపోయింది. మొత్తానికి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ రాకతో హౌస్‌లోని సభ్యుల ముఖచిత్రాలు మారిపోయాయి. బయట జరుగుతున్న పరిణామాలు, తమ ఆటతీరుపై మాజీ కంటెస్టెంట్స్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో ప్రస్తుత హౌస్‌మేట్స్ తీవ్ర ఆలోచనలో పడ్డారు. ఈ నామినేషన్స్ ప్రక్రియతో రాబోయే రోజుల్లో హౌస్‌లో మరిన్ని వివాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.మరింత చదవండి

Source link