Last Updated:
బట్టలను వెంటనే ఉతికినా కొన్నిసార్లు పాల వాసన పూర్తిగా పోదు. పాలలో ఉండే ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు బట్టల నారల్లోకి ఇంకిపోవడం వల్ల ఈ వాసన ఎక్కువసేపు ఉండవచ్చు.
పిల్లల బట్టలపై పాలు పడటం చాలా సాధారణం. ముఖ్యంగా చిన్న పిల్లలు పాలు తాగిన తర్వాత ఉమ్మివేయడం లేదా పాలు చిందించడం వల్ల బట్టలపై మరకలు, వాసన ఏర్పడుతుంటాయి. బట్టలను వెంటనే ఉతికినా కొన్నిసార్లు పాల వాసన పూర్తిగా పోదు. పాలలో ఉండే ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు బట్టల నారల్లోకి ఇంకిపోవడం వల్ల ఈ వాసన ఎక్కువసేపు ఉండవచ్చు. అందుకే బట్టలను డిటర్జెంట్‌తో పదేపదే ఉతకడం కంటే, ఉతకడానికి ముందు మరక ఉన్న ప్రాంతాన్ని సరిగ్గా శుభ్రం చేయడం మంచిది.

