1982లో వచ్చిన భక్త ధృవ మార్కాండేయ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది శోభన. ఆ తర్వాత విక్రమ్, మువ్వ గోపాలుడు, త్రిమూర్తులు, రుద్రవీణ, అభినందన, నారి నారి నడుమ మురారి, నేటి సిద్ధార్థ, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, రౌడీ అల్లుడు ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ల మీద హిట్లు కొడుతూ.. అనతికాలంలోనే అగ్ర కథానాయికగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది.

