ప్రభన్యూస్

AP Liquor Scam: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని సునీల్ దందా! మద్యం రవాణా కుంభకోణంలో షాకింగ్ నిజాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

AP Liquor Scam: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కారుమూరి సునీల్ (ఫైల్ ఫోటో)
కారుమూరి సునీల్ (ఫైల్ ఫోటో)

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ తన తండ్రి రాజకీయాధికారాన్ని అడ్డుపెట్టుకొని భారీ స్థాయిలో మద్యం అక్రమ రవాణా దందాకు పాల్పడినట్లు ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ కుంభకోణం ద్వారా పొందిన అక్రమ సంపాదనను నేరుగా తన స్వంత ఖాతాకే బదిలీ చేయించుకున్నాడని ఆధారాలతో సహా కోర్టు ముందుంచింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన కారుమూరి సునీల్, ఏపీ బీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను సిట్ అధికారులు పిటిషన్ వారెంట్‌పై హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

రూ. 15 కోట్ల అక్రమ లావాదేవీలు

ఈనాడు కథనం ప్రకారం.. విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) విజయలక్ష్మి వాదనలు వినిపిస్తూ.. మద్యం రవాణా ఒప్పందాల్లో తీవ్ర స్థాయిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తెలిపారు. సిండికేట్ లాభాలను ఎరగా చూపి కోస్తా జిల్లాలకు సంబంధించి మద్యం రవాణా కాంట్రాక్టును కారుమూరి సునీల్ తన భార్య కీర్తితో కలిసి ‘సుదర్శన్ జనరల్ ప్రాజెక్ట్స్’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆధారాలు సమర్పించారు.

ఈ మొత్తం అక్రమ రవాణా వ్యవహారాన్ని కారుమూరి సునీలే స్వయంగా పర్యవేక్షించారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. సుదర్శన్ జనరల్ ప్రాజెక్ట్స్ సంస్థ నుంచి దాదాపు రూ. 15 కోట్ల మేర సొమ్ము కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ మరియు కోడలు కీర్తిల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లోకి జమైనట్లు పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టుకు నివేదించారు. నిందితుడిపై బిఎన్ఎస్ (BNS) సెక్షన్ 409 కింద తీవ్రమైన నేరారోపణలు మోపారు.

సిట్ అధికారులకే ప్రలోభాలు – దర్యాప్తును పక్కదారి పట్టించే యత్నం

ఈ కేసు విచారణ నుంచి తప్పుకునేందుకు నిందితుడు ఏకంగా సిట్ అధికారులనే ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడని, దీనిపై కూడా ప్రత్యేకంగా కేసు నమోదు చేసినట్లు డీడీ విజయలక్ష్మి వెల్లడించారు. నాటి ఏపీ బీఎస్‌బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి మద్యం రవాణా విధానాన్ని పూర్తిగా అస్తవ్యస్తంగా మార్చగా, అతని వెనుక ఉండి రాజ్ కేసిరెడ్డి శాసించాడని విచారణలో తేలింది.

మరోవైపు నిందితుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, సెక్షన్ 409 మినహా మిగిలినవన్నీ ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లేనని, నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వాలని కోరారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ జైలుకే రిమాండ్ ఇవ్వాలని అభ్యర్థించారు.

హైదరాబాద్ జైలుకు తరలింపు

ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయాధికారి తేజోవతి, నిందితులు ముగ్గురికీ వచ్చే నెల 3వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాల విన్నపాన్ని పరిశీలించిన న్యాయస్థానం, వీరిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కారాగారానికే తరలించాలని ఆదేశించింది. దీంతో సిట్ అధికారులు నిందితులను కట్టుదిట్టమైన భద్రత నడుమ హైదరాబాద్‌కు తరలించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 9:22 am Digital Edition : Prabhanews
AP Liquor Scam: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని సునీల్ దందా! మద్యం రవాణా కుంభకోణంలో షాకింగ్ నిజాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 21, 2026 5:06 AM ISTAP Liquor Scam: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.కారుమూరి సునీల్ (ఫైల్ ఫోటో)మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ తన తండ్రి రాజకీయాధికారాన్ని అడ్డుపెట్టుకొని భారీ స్థాయిలో మద్యం అక్రమ రవాణా దందాకు పాల్పడినట్లు ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ కుంభకోణం ద్వారా పొందిన అక్రమ సంపాదనను నేరుగా తన స్వంత ఖాతాకే బదిలీ చేయించుకున్నాడని ఆధారాలతో సహా కోర్టు ముందుంచింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన కారుమూరి సునీల్, ఏపీ బీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను సిట్ అధికారులు పిటిషన్ వారెంట్‌పై హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.రూ. 15 కోట్ల అక్రమ లావాదేవీలుఈనాడు కథనం ప్రకారం.. విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) విజయలక్ష్మి వాదనలు వినిపిస్తూ.. మద్యం రవాణా ఒప్పందాల్లో తీవ్ర స్థాయిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తెలిపారు. సిండికేట్ లాభాలను ఎరగా చూపి కోస్తా జిల్లాలకు సంబంధించి మద్యం రవాణా కాంట్రాక్టును కారుమూరి సునీల్ తన భార్య కీర్తితో కలిసి 'సుదర్శన్ జనరల్ ప్రాజెక్ట్స్' సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆధారాలు సమర్పించారు.ఈ మొత్తం అక్రమ రవాణా వ్యవహారాన్ని కారుమూరి సునీలే స్వయంగా పర్యవేక్షించారని ప్రాసిక్యూషన్ పేర్కొంది. సుదర్శన్ జనరల్ ప్రాజెక్ట్స్ సంస్థ నుంచి దాదాపు రూ. 15 కోట్ల మేర సొమ్ము కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ మరియు కోడలు కీర్తిల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లోకి జమైనట్లు పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టుకు నివేదించారు. నిందితుడిపై బిఎన్ఎస్ (BNS) సెక్షన్ 409 కింద తీవ్రమైన నేరారోపణలు మోపారు.సిట్ అధికారులకే ప్రలోభాలు – దర్యాప్తును పక్కదారి పట్టించే యత్నంఈ కేసు విచారణ నుంచి తప్పుకునేందుకు నిందితుడు ఏకంగా సిట్ అధికారులనే ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడని, దీనిపై కూడా ప్రత్యేకంగా కేసు నమోదు చేసినట్లు డీడీ విజయలక్ష్మి వెల్లడించారు. నాటి ఏపీ బీఎస్‌బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి మద్యం రవాణా విధానాన్ని పూర్తిగా అస్తవ్యస్తంగా మార్చగా, అతని వెనుక ఉండి రాజ్ కేసిరెడ్డి శాసించాడని విచారణలో తేలింది.మరోవైపు నిందితుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, సెక్షన్ 409 మినహా మిగిలినవన్నీ ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లేనని, నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వాలని కోరారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ జైలుకే రిమాండ్ ఇవ్వాలని అభ్యర్థించారు.హైదరాబాద్ జైలుకు తరలింపుఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయాధికారి తేజోవతి, నిందితులు ముగ్గురికీ వచ్చే నెల 3వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాల విన్నపాన్ని పరిశీలించిన న్యాయస్థానం, వీరిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కారాగారానికే తరలించాలని ఆదేశించింది. దీంతో సిట్ అధికారులు నిందితులను కట్టుదిట్టమైన భద్రత నడుమ హైదరాబాద్‌కు తరలించారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link