ప్రభన్యూస్

Anupama Parameswaran: పెళ్లికి ముందే బిడ్డను కనాలని ఉంది.. వామ్మో, అనుపమ ఏమంటుందో చూశారా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా క్రేజీ కళ్యాణం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లి గురించి రియాక్ట్ అయింది ఈ యంగ్ హీరోయిన్.

News18
News18

‘ప్రేమమ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్, తనదైన శైలిలో నటిస్తూ వరుస విజయాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. క్యూట్ లుక్స్‌తో పాటు అద్భుతమైన నటనా ప్రతిభతో అందరినీ ఆకట్టుకునే ఈ భామ, ఇటీవలే ‘టిల్లు స్క్వేర్’ లాంటి చిత్రాలతో తనలోని గ్లామర్, బోల్డ్ యాంగిల్‌ను సైతం ప్రేక్షకులకు పరిచయం చేసింది. అయితే, సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ తాను చాలా బోల్డ్ అండ్ ఇండిపెండెంట్ అని నిరూపించుకుంటూ, తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దసరా పండుగ కానుకగా తాజాగా విడుదలైన ‘క్రేజీ కల్యాణం’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న అనుపమ, వివాహ వ్యవస్థ, మాతృత్వం, మహిళల స్వేచ్ఛపై తనకున్న ఆధునిక ఆలోచనలపై ఓపెన్ గా మాట్లాడింది.

పెళ్లి, పిల్లల గురించి అనుపమ తన మనసులోని కోరికను చాలా స్పష్టంగా బయటపెట్టింది. అసలు పెళ్లికి ముందే తాను ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వాలని, మాతృత్వంలోని మాధుర్యాన్ని పెళ్లికంటే ముందే ఆస్వాదించాలన్నదే తన ప్రగాఢ కోరిక అని ఆమె చెప్పడంతో అభిమానులతో పాటు నెటిజన్లు కూడా తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. పెళ్లి విషయంలో తన తల్లిదండ్రుల వైపు నుంచి తనపై ఎలాంటి ఒత్తిడీ, తొందరపాటు లేవని ఆమె తెలిపింది. తనకి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడే ఆ నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛను ఇంట్లో వారు ఇచ్చారని అనుపమ స్పష్టం చేసింది. నేటి సమాజంలో ఇలాంటి ఆలోచనలు కొందరికి సంప్రదాయాలకు విరుద్ధంగా అనిపించినప్పటికీ, తన వ్యక్తిగత ఇష్టాలను మాత్రం ధైర్యంగా కుండబద్దలు కొట్టింది.

అదే సమయంలో ప్రస్తుత వివాహ బంధం గురించి అనుపమ మాట్లాడుతూ.. “పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు పరస్పరం గౌరవించుకుంటూ, సంతోషంగా కలిసి జీవితంలో అడుగులు వేయడానికి ఉద్దేశించిన ఒక అందమైన బంధం. అంతేకానీ, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి, కేవలం నాలుగు గోడలకే పరిమితం చేసి, ఆమెను ఒక పనిమనిషిలా చూడటానికి కాదు” అని ఘాటుగా సమాధానమిచ్చింది. ఆధునిక మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వివాహం తర్వాత కూడా వారి అస్తిత్వాన్ని, స్వేచ్ఛను గౌరవించే వాతావరణం ఉండాలన్నది తన అభిప్రాయంగా వెల్లడించింది.

ఇక క్రేజీ కళ్యాణం సినిమా విషయానికొస్తే.. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘క్రేజీ కల్యాణం’ దసరా కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తోంది. బూసం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టులో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు సీనియర్ నటుడు నరేశ్, యువ దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా టైటిల్ వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని కూడా ఆమె పంచుకుంది. షూటింగ్ సమయంలో సెట్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణుల ఆలోచనలు, అక్కడ పండిన హాస్యం, సన్నివేశాలు అన్నీ ఎంతో సరదాగా, ‘క్రేజీ’గా అనిపించడంతో.. దర్శకుడు బద్రప్ప మొదట అనుకున్న టైటిల్‌ను పక్కనపెట్టి, ఈ సినిమాకి ‘క్రేజీ కల్యాణం’ అని పేరు మార్చారని అనుపమ వివరించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 October 2026, 9:09 am Digital Edition : Prabhanews
Anupama Parameswaran: పెళ్లికి ముందే బిడ్డను కనాలని ఉంది.. వామ్మో, అనుపమ ఏమంటుందో చూశారా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 16, 2026 9:03 AM ISTఅనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా క్రేజీ కళ్యాణం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లి గురించి రియాక్ట్ అయింది ఈ యంగ్ హీరోయిన్.
News18'ప్రేమమ్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్, తనదైన శైలిలో నటిస్తూ వరుస విజయాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. క్యూట్ లుక్స్‌తో పాటు అద్భుతమైన నటనా ప్రతిభతో అందరినీ ఆకట్టుకునే ఈ భామ, ఇటీవలే 'టిల్లు స్క్వేర్' లాంటి చిత్రాలతో తనలోని గ్లామర్, బోల్డ్ యాంగిల్‌ను సైతం ప్రేక్షకులకు పరిచయం చేసింది. అయితే, సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ తాను చాలా బోల్డ్ అండ్ ఇండిపెండెంట్ అని నిరూపించుకుంటూ, తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దసరా పండుగ కానుకగా తాజాగా విడుదలైన ‘క్రేజీ కల్యాణం’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న అనుపమ, వివాహ వ్యవస్థ, మాతృత్వం, మహిళల స్వేచ్ఛపై తనకున్న ఆధునిక ఆలోచనలపై ఓపెన్ గా మాట్లాడింది.పెళ్లి, పిల్లల గురించి అనుపమ తన మనసులోని కోరికను చాలా స్పష్టంగా బయటపెట్టింది. అసలు పెళ్లికి ముందే తాను ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వాలని, మాతృత్వంలోని మాధుర్యాన్ని పెళ్లికంటే ముందే ఆస్వాదించాలన్నదే తన ప్రగాఢ కోరిక అని ఆమె చెప్పడంతో అభిమానులతో పాటు నెటిజన్లు కూడా తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. పెళ్లి విషయంలో తన తల్లిదండ్రుల వైపు నుంచి తనపై ఎలాంటి ఒత్తిడీ, తొందరపాటు లేవని ఆమె తెలిపింది. తనకి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడే ఆ నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛను ఇంట్లో వారు ఇచ్చారని అనుపమ స్పష్టం చేసింది. నేటి సమాజంలో ఇలాంటి ఆలోచనలు కొందరికి సంప్రదాయాలకు విరుద్ధంగా అనిపించినప్పటికీ, తన వ్యక్తిగత ఇష్టాలను మాత్రం ధైర్యంగా కుండబద్దలు కొట్టింది.అదే సమయంలో ప్రస్తుత వివాహ బంధం గురించి అనుపమ మాట్లాడుతూ.. "పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు పరస్పరం గౌరవించుకుంటూ, సంతోషంగా కలిసి జీవితంలో అడుగులు వేయడానికి ఉద్దేశించిన ఒక అందమైన బంధం. అంతేకానీ, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి, కేవలం నాలుగు గోడలకే పరిమితం చేసి, ఆమెను ఒక పనిమనిషిలా చూడటానికి కాదు" అని ఘాటుగా సమాధానమిచ్చింది. ఆధునిక మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, వివాహం తర్వాత కూడా వారి అస్తిత్వాన్ని, స్వేచ్ఛను గౌరవించే వాతావరణం ఉండాలన్నది తన అభిప్రాయంగా వెల్లడించింది.ఇక క్రేజీ కళ్యాణం సినిమా విషయానికొస్తే.. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘క్రేజీ కల్యాణం’ దసరా కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తోంది. బూసం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టులో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు సీనియర్ నటుడు నరేశ్, యువ దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమా టైటిల్ వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని కూడా ఆమె పంచుకుంది. షూటింగ్ సమయంలో సెట్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణుల ఆలోచనలు, అక్కడ పండిన హాస్యం, సన్నివేశాలు అన్నీ ఎంతో సరదాగా, 'క్రేజీ'గా అనిపించడంతో.. దర్శకుడు బద్రప్ప మొదట అనుకున్న టైటిల్‌ను పక్కనపెట్టి, ఈ సినిమాకి ‘క్రేజీ కల్యాణం’ అని పేరు మార్చారని అనుపమ వివరించింది.మరింత చదవండి

Source link