అనిరుధ్ రవిచందర్ భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన యువ సంగీత దర్శకులలో, గాయకులలో ఒకరు. చెన్నైలో నటులైన రవి రాఘవేంద్ర- లక్ష్మి దంపతులకు జన్మించిన ఇతను, సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు బంధువు (రజనీ భార్య లత ఇతని అత్తగారు). ‘3’ చిత్రంలోని “వై దిస్ కొలవెరి డి” పాటతో 21 ఏళ్ల వయసులోనే రాత్రికి రాత్రే ప్రపంచవ్యాప్త సంచలనంగా మారిన అనిరుధ్, అప్పటి నుండి కట్టి, విక్రమ్, జైలర్, లియో, జవాన్, దేవర వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సూపర్‌హిట్ పాటలు.. ఉత్కంఠభరితమైన నేపథ్య సంగీతం (BGM) అందించారు. ప్రస్తుతం అతను దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే ‘రాక్‌స్టార్’ సంగీత దర్శకుడిగా ఉన్నారు.

