ప్రభన్యూస్

Andhra Pradesh: నకిలీ పత్రాలతో రూ.4 కోట్ల భూకబ్జా కుట్ర.. అరెస్టు భయంతో కుటుంబంతో తమ్మినేని పరారీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కుట్ర కేసులో వైకాపా నియోజకవర్గ నేత, రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నట్లు వార్తలు రావడం గమనార్హం.

తమ్మినేని
తమ్మినేని

శ్రీకాకుళం నగర శివార్లలో బతికున్న భూ యజమానిని చనిపోయినట్లు చూపిస్తూ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, నకిలీ వారసత్వ సర్టిఫికెట్లు సృష్టించి భూమిని కొట్టేసేందుకు పన్నిన కుట్ర బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ తీవ్ర నేరారోపణల కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య తమ్మినేని వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ (నాని)లపై పోలీసులు కేసు నమోదు చేయడంతో అరెస్టు భయం పట్టుకుంది. దీంతో వారు పోలీసుల కళ్లుగప్పి పరారైనట్లు తెలిసింది.

భూకబ్జా కుట్ర నేపథ్యం

ఈనాడు కథనం ప్రకారం.. శ్రీకాకుళం సమీపంలోని ఆమదాలవలస మండలం బలగ పరిధిలోని చాపురం గ్రామంలో ప్లాట్లు నంబర్లు 84, 85, 86లతో కూడిన సుమారు 900 చదరపు గజాల విలువైన భూమిని కట్టా కనక లింగేశ్వరరావు అనే వ్యక్తి 1988, 1992 మధ్యకాలంలో ఖరీదు చేశారు. ఉద్యోగ రీత్యా ఆయన కుటుంబం హైదరాబాద్‌లో నివాసముంటుండటంతో ఆ ఖాళీ స్థలంపై స్థానిక భూకబ్జా ముఠా కన్నుపడింది.

బతికున్న భూ యజమాని చనిపోయాడని నకిలీ డెత్ సర్టిఫికేట్ తయారు చేసి, ఒడిశాకు చెందిన ఒక మహిళను ఏకైక వారసురాలిగా చూపిస్తూ నకిలీ సక్సెషన్ సర్టిఫికేట్లను సృష్టించారు. ఆపై హిరామండలం సబ్-రజిస్ట్రార్ కార్యాలయాన్ని ఉపయోగించుకొని, తమ్మినేని సీతారాం సొంత కళాశాల అధ్యాపకులతో నకిలీ సాక్షి సంతకాలు పెట్టించి సదరు భూమిని తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ పేరుమీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. బాధితుడి కుమారుడు తన స్థలం వద్ద కాంపౌండ్ వాల్ నిర్మిస్తుండటాన్ని గమనించి ప్రశ్నించడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వేగవంతమైన దర్యాప్తు – 8 మంది అరెస్ట్

బాధితుడు కట్టా జైశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ కుట్రలో మొత్తం 13 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి, ఇప్పటికే ఎనిమిది మంది ప్రధాన అనుచరులు, రబ్బర్ స్టాంప్స్ తయారీదారులు, డాక్యుమెంట్ రైటర్లను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో తమ్మినేని సీతారాం (A6), ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ (A5), భార్య వాణి (A7)గా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

అర్ధరాత్రి ప్లాన్.. ఇన్నోవా కారులో పరారీ

పోలీసుల దర్యాప్తు వేగవంతం కావడం, కీలక నిందితులు అరెస్ట్ కావడంతో తమ్మినేని కుటుంబానికి అరెస్టు తప్పదని స్పష్టమైంది. ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు బట్టబయలు చేయడంతో తమ్మినేని కుటుంబంలో కలకలం రేగింది.

అప్పటివరకు ఆమదాలవలసలోని అద్దె ఇంట్లో ఉన్న తమ్మినేని సీతారాం కుటుంబమంతా సోమవారం తెల్లవారుజామున సుమారు 3.00 గంటల ప్రాంతంలో ప్రణాళికాబద్ధంగా తప్పించుకున్నారు. ఇంట్లో తమ సొంత రెండు కార్లు ఉన్నప్పటికీ, పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు ప్రైవేటుగా ఒక ఇన్నోవా కారును తెప్పించుకుని అందులో రహస్యంగా పరారయ్యారు. అంతేకాకుండా, లొకేషన్ ట్రాక్ కాకుండా ఉండేందుకు తమ మొబైల్ ఫోన్లను సైతం ఇంట్లోనే వదిలేసి వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు

మాజీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి, తన కుటుంబసభ్యులతో కలిసి క్రిమినల్ కేసులో అరెస్టు భయంతో పోలీసుల కళ్లుగప్పి పారిపోవడం తీవ్ర రాజకీయ చర్చనీయాంశమైంది. ఈ కేసులో పరారీలో ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య, కుమారుడితో పాటు మిగిలిన నిందితులను పట్టుకునేందుకు శ్రీకాకుళం పోలీసులు ప్రత్యేక విచారణ బృందాలను (Special Teams) రంగంలోకి దించారు. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, తెలంగాణతో పాటు సమీప జిల్లాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 8:49 am Digital Edition : Prabhanews
Andhra Pradesh: నకిలీ పత్రాలతో రూ.4 కోట్ల భూకబ్జా కుట్ర.. అరెస్టు భయంతో కుటుంబంతో తమ్మినేని పరారీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 21, 2026 5:24 AM ISTAndhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కుట్ర కేసులో వైకాపా నియోజకవర్గ నేత, రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నట్లు వార్తలు రావడం గమనార్హం.తమ్మినేనిశ్రీకాకుళం నగర శివార్లలో బతికున్న భూ యజమానిని చనిపోయినట్లు చూపిస్తూ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, నకిలీ వారసత్వ సర్టిఫికెట్లు సృష్టించి భూమిని కొట్టేసేందుకు పన్నిన కుట్ర బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ తీవ్ర నేరారోపణల కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య తమ్మినేని వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ (నాని)లపై పోలీసులు కేసు నమోదు చేయడంతో అరెస్టు భయం పట్టుకుంది. దీంతో వారు పోలీసుల కళ్లుగప్పి పరారైనట్లు తెలిసింది.భూకబ్జా కుట్ర నేపథ్యంఈనాడు కథనం ప్రకారం.. శ్రీకాకుళం సమీపంలోని ఆమదాలవలస మండలం బలగ పరిధిలోని చాపురం గ్రామంలో ప్లాట్లు నంబర్లు 84, 85, 86లతో కూడిన సుమారు 900 చదరపు గజాల విలువైన భూమిని కట్టా కనక లింగేశ్వరరావు అనే వ్యక్తి 1988, 1992 మధ్యకాలంలో ఖరీదు చేశారు. ఉద్యోగ రీత్యా ఆయన కుటుంబం హైదరాబాద్‌లో నివాసముంటుండటంతో ఆ ఖాళీ స్థలంపై స్థానిక భూకబ్జా ముఠా కన్నుపడింది.బతికున్న భూ యజమాని చనిపోయాడని నకిలీ డెత్ సర్టిఫికేట్ తయారు చేసి, ఒడిశాకు చెందిన ఒక మహిళను ఏకైక వారసురాలిగా చూపిస్తూ నకిలీ సక్సెషన్ సర్టిఫికేట్లను సృష్టించారు. ఆపై హిరామండలం సబ్-రజిస్ట్రార్ కార్యాలయాన్ని ఉపయోగించుకొని, తమ్మినేని సీతారాం సొంత కళాశాల అధ్యాపకులతో నకిలీ సాక్షి సంతకాలు పెట్టించి సదరు భూమిని తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ పేరుమీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. బాధితుడి కుమారుడు తన స్థలం వద్ద కాంపౌండ్ వాల్ నిర్మిస్తుండటాన్ని గమనించి ప్రశ్నించడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.పోలీసుల వేగవంతమైన దర్యాప్తు – 8 మంది అరెస్ట్బాధితుడు కట్టా జైశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ కుట్రలో మొత్తం 13 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి, ఇప్పటికే ఎనిమిది మంది ప్రధాన అనుచరులు, రబ్బర్ స్టాంప్స్ తయారీదారులు, డాక్యుమెంట్ రైటర్లను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో తమ్మినేని సీతారాం (A6), ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ (A5), భార్య వాణి (A7)గా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.అర్ధరాత్రి ప్లాన్.. ఇన్నోవా కారులో పరారీపోలీసుల దర్యాప్తు వేగవంతం కావడం, కీలక నిందితులు అరెస్ట్ కావడంతో తమ్మినేని కుటుంబానికి అరెస్టు తప్పదని స్పష్టమైంది. ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు బట్టబయలు చేయడంతో తమ్మినేని కుటుంబంలో కలకలం రేగింది.అప్పటివరకు ఆమదాలవలసలోని అద్దె ఇంట్లో ఉన్న తమ్మినేని సీతారాం కుటుంబమంతా సోమవారం తెల్లవారుజామున సుమారు 3.00 గంటల ప్రాంతంలో ప్రణాళికాబద్ధంగా తప్పించుకున్నారు. ఇంట్లో తమ సొంత రెండు కార్లు ఉన్నప్పటికీ, పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు ప్రైవేటుగా ఒక ఇన్నోవా కారును తెప్పించుకుని అందులో రహస్యంగా పరారయ్యారు. అంతేకాకుండా, లొకేషన్ ట్రాక్ కాకుండా ఉండేందుకు తమ మొబైల్ ఫోన్లను సైతం ఇంట్లోనే వదిలేసి వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలుమాజీ స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి, తన కుటుంబసభ్యులతో కలిసి క్రిమినల్ కేసులో అరెస్టు భయంతో పోలీసుల కళ్లుగప్పి పారిపోవడం తీవ్ర రాజకీయ చర్చనీయాంశమైంది. ఈ కేసులో పరారీలో ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య, కుమారుడితో పాటు మిగిలిన నిందితులను పట్టుకునేందుకు శ్రీకాకుళం పోలీసులు ప్రత్యేక విచారణ బృందాలను (Special Teams) రంగంలోకి దించారు. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, తెలంగాణతో పాటు సమీప జిల్లాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link