ప్రభన్యూస్

Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల విషాదాంతం.. మరణంలోనూ విడిపోని చిన్ననాటి స్నేహం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన సాయిశ్రీధర్‌ (28), హర్షవర్ధన్‌ (22), జయకిశోర్‌ (18) అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

News18
News18

చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన సాయిశ్రీధర్‌ (28), హర్షవర్ధన్‌ (22), జయకిశోర్‌ (18) అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్ననాటి నుంచి ఎంతో ఆప్యాయంగా పెరిగిన ఈ ముగ్గురు స్నేహితులు జీవితంలోనే కాదు.. మరణంలోనూ ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఒకేసారి కన్నుమూయడం అందరినీ కలచివేసింది.

శనివారం ఉదయం మృతదేహాలను రిమ్స్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమ కళ్ల ముందే యువకుల మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు గుండెలవిసేలా రోదించారు. ఆస్పత్రి ప్రాంగణం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువుల ఆర్తనాదాలతో అక్కడి వాతావరణం హృదయ విదారకంగా మారింది.

ముఖ్యంగా హర్షవర్ధన్ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. “శివయ్యా… నీకు ఎన్నో పూజలు చేశాను. నిన్నే నమ్ముకున్నాను. అయినా నా కొడుకును నాకెందుకు దూరం చేశావు? ఒక్కసారి నా బిడ్డను బతికిస్తే నిన్ను ఇంటికి తీసుకెళ్లి జీవితాంతం పూజలు చేస్తాను” అంటూ ఆమె చేసిన ఆర్తనాదాలు అక్కడున్న వారిని తీవ్ర భావోద్వేగానికి గురిచేశాయి. తల్లి రోదనలు విన్న పలువురు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.

ఇక జయకిశోర్ తల్లి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇప్పటికే కొంతకాలం క్రితం భర్తను కోల్పోయిన ఆమెకు కుమారుడే జీవనాధారం. భర్త లేని లోటును తన కుమారుడు తీర్చుతాడని, తనకు అండగా ఉంటాడని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన విషాదం ఆమె జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది. “నా భర్త పోయాడు… ఇప్పుడు నా కుమారుడూ నన్ను విడిచిపోయాడు. ఇక నేను ఎవరి కోసం బతకాలి? నా జీవితానికి అర్థమేంటి?” అంటూ ఆమె కన్నీరుమున్నీరుగా విలపించడం ప్రతి ఒక్కరినీ కదిలించింది.

సాయిశ్రీధర్ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా, కుటుంబానికి అండగా నిలుస్తాడని ఆశించిన కుమారుడు ఒక్కసారిగా దూరం కావడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. బంధువులు, గ్రామస్థులు కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు ప్రయత్నించినా వారి దుఃఖం మాత్రం తగ్గలేదు.

చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని, కలిసి తిరిగి, జీవితంలో ప్రతి ఆనందాన్ని పంచుకున్న ఈ ముగ్గురు స్నేహితులు ఒకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. “జీవితాంతం కలిసి ఉంటామని చెప్పుకునే వారు… చివరికి మరణంలోనూ ఒకరినొకరు విడిచిపెట్టలేదు” అంటూ గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.

పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామాలకు తరలించగా, చివరిసారి వారిని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంతిమయాత్రలో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. యువకుల మృతితో వారి కుటుంబాల్లోనే కాకుండా మొత్తం ప్రాంతంలో శోకసంద్రం నెలకొంది. ఈ విషాద ఘటనను తలుచుకుంటూ స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 7:48 am Digital Edition : Prabhanews
Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల విషాదాంతం.. మరణంలోనూ విడిపోని చిన్ననాటి స్నేహం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 28, 2026 6:24 AM ISTచెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన సాయిశ్రీధర్‌ (28), హర్షవర్ధన్‌ (22), జయకిశోర్‌ (18) అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. News18చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన సాయిశ్రీధర్‌ (28), హర్షవర్ధన్‌ (22), జయకిశోర్‌ (18) అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. చిన్ననాటి నుంచి ఎంతో ఆప్యాయంగా పెరిగిన ఈ ముగ్గురు స్నేహితులు జీవితంలోనే కాదు.. మరణంలోనూ ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఒకేసారి కన్నుమూయడం అందరినీ కలచివేసింది.శనివారం ఉదయం మృతదేహాలను రిమ్స్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమ కళ్ల ముందే యువకుల మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు గుండెలవిసేలా రోదించారు. ఆస్పత్రి ప్రాంగణం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువుల ఆర్తనాదాలతో అక్కడి వాతావరణం హృదయ విదారకంగా మారింది.ముఖ్యంగా హర్షవర్ధన్ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. "శివయ్యా... నీకు ఎన్నో పూజలు చేశాను. నిన్నే నమ్ముకున్నాను. అయినా నా కొడుకును నాకెందుకు దూరం చేశావు? ఒక్కసారి నా బిడ్డను బతికిస్తే నిన్ను ఇంటికి తీసుకెళ్లి జీవితాంతం పూజలు చేస్తాను" అంటూ ఆమె చేసిన ఆర్తనాదాలు అక్కడున్న వారిని తీవ్ర భావోద్వేగానికి గురిచేశాయి. తల్లి రోదనలు విన్న పలువురు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.ఇక జయకిశోర్ తల్లి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇప్పటికే కొంతకాలం క్రితం భర్తను కోల్పోయిన ఆమెకు కుమారుడే జీవనాధారం. భర్త లేని లోటును తన కుమారుడు తీర్చుతాడని, తనకు అండగా ఉంటాడని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన విషాదం ఆమె జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది. "నా భర్త పోయాడు... ఇప్పుడు నా కుమారుడూ నన్ను విడిచిపోయాడు. ఇక నేను ఎవరి కోసం బతకాలి? నా జీవితానికి అర్థమేంటి?" అంటూ ఆమె కన్నీరుమున్నీరుగా విలపించడం ప్రతి ఒక్కరినీ కదిలించింది.సాయిశ్రీధర్ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా, కుటుంబానికి అండగా నిలుస్తాడని ఆశించిన కుమారుడు ఒక్కసారిగా దూరం కావడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. బంధువులు, గ్రామస్థులు కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు ప్రయత్నించినా వారి దుఃఖం మాత్రం తగ్గలేదు.చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని, కలిసి తిరిగి, జీవితంలో ప్రతి ఆనందాన్ని పంచుకున్న ఈ ముగ్గురు స్నేహితులు ఒకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. "జీవితాంతం కలిసి ఉంటామని చెప్పుకునే వారు... చివరికి మరణంలోనూ ఒకరినొకరు విడిచిపెట్టలేదు" అంటూ గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామాలకు తరలించగా, చివరిసారి వారిని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంతిమయాత్రలో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. యువకుల మృతితో వారి కుటుంబాల్లోనే కాకుండా మొత్తం ప్రాంతంలో శోకసంద్రం నెలకొంది. ఈ విషాద ఘటనను తలుచుకుంటూ స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link