Last Updated:
Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి గగనతలంలో పెను ప్రమాదం తప్పింది.
ఆయన ప్రయాణిస్తున్న విమానం రన్‌వే పైనుంచి టేకాఫ్ అవుతున్న అత్యంత కీలకమైన సమయంలో గుర్తుతెలియని ఒక డ్రోన్ విమానానికి అతి సమీపంలోకి దూసుకొచ్చింది. కొద్దిపాటి తేడాతో విమానం ఆ డ్రోన్‌ను ఢీకొట్టే ప్రమాదం నుంచి బయటపడింది. ఏమాత్రం అటూఇటూ అయినా పెను విపత్తు జరిగి ఉండేదని అధికారులు భావిస్తున్నారు. ఈ తీవ్ర భద్రతా వైఫల్యం, ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను నార్వే ప్రధాన మంత్రి జోనాస్ స్టోర్ స్వయంగా అధికారికంగా వెల్లడించారు.

