Last Updated:
ఉదయం లేవగానే దాహంగా అనిపిస్తే నీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ద్రవాలు అందుతాయి. అయితే నిద్రలేచిన వెంటనే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగితే శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయని చాలామంది అనుకుంటారు.
చాలా మందికి ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. రాత్రంతా నిద్రలో ఉండటంతో కొన్ని గంటలపాటు నీరు తీసుకోలేం. ఈ సమయంలో శ్వాస, చెమట, మూత్రం ద్వారా శరీరం కొంత ద్రవాన్ని కోల్పోతుంది. అందుకే ఉదయం లేవగానే దాహంగా అనిపిస్తే నీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ద్రవాలు అందుతాయి. అయితే నిద్రలేచిన వెంటనే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగితే శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయని చాలామంది అనుకుంటారు. దీనికి మాత్రం బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.

