Last Updated:
చదివింది 4వ తరగతి.. ఏడాదికి ఏకంగా రూ.3 కోట్ల టర్నోవర్.. తెలుగు రైతు ఐడియా అదరహో!
చదువు తక్కువైనా.. పట్టుదల ఉంటే కోట్లు సంపాదించవచ్చని నిరూపిస్తున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన షేక్ సయ్యద్. నాలుగో తరగతి వరకే చదివిన ఈ 42 ఏళ్ల రైతు.. వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. గడిచిన 22 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ నిత్యం కొత్త ప్రయోగాలు చేస్తున్న ఆయన.. ఆరేళ్లుగా వక్క సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేవలం పంట పండించడంతోనే ఆగిపోకుండా.. మూడేళ్ల కిందట సత్తుపల్లిలో సొంతంగా వక్క ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు చేసి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు.

