ఎలా బ్లాక్ చేయాలంటే?
ఫోన్ పోయిన వెంటనే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిది. పోలీస్ కంప్లైంట్ లేదా FIR/LR కాపీని దగ్గర ఉంచుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌కు సంబంధించి డూప్లికేట్ SIM తీసుకోవాలి. CEIR ప్రకారం బ్లాకింగ్ రిక్వెస్ట్ సమయంలో OTP ధ్రువీకరణ కోసం ఈ రీ-ఇష్యూ చేసిన నంబర్ అవసరం అవుతుంది. ఆ తర్వాత CEIR/సంచార్ సాథి పోర్టల్‌లో “Block Stolen/Lost Mobile” ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మొబైల్ నంబర్, 15 అంకెల IMEI, మొబైల్ బ్రాండ్, మోడల్, ఫోన్ పోయిన ప్రదేశం, తేదీ, పోలీస్ ఫిర్యాదు వివరాలు వంటి సమాచారాన్ని నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను కూడా అప్లోడ్ చేయాలి. సాధారణంగా పోలీస్ ఫిర్యాదు కాపీ, గుర్తింపు ధ్రువీకరణ పత్రం అవసరం అవుతాయి. మొబైల్ కొనుగోలు ఇన్వాయిస్ ఉంటే దాన్ని కూడా అందించవచ్చని CEIR చెబుతోంది. రిక్వెస్ట్‌ను సబ్మిట్ చేసిన తర్వాత మీకు Request ID వస్తుంది. ఈ Request IDని భద్రంగా ఉంచుకోవాలి. తర్వాత మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలుసుకోవడానికి, ఫోన్ తిరిగి దొరికితే IMEIని అన్‌బ్లాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
