రైలులో ప్రయాణించే వారికి ముఖ్యమైన సమాచారం. జమ్మికుంట, పోత్కపల్లి స్టేషన్ల మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ ఏర్పాటు పనులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో కాజీపేట-బల్హార్షా మార్గంలో పలు రైళ్ల సర్వీసుల్లో మార్పులు చేశారని, కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు కాగా, మరికొన్ని కొంత దూరం వరకు మాత్రమే నడుస్తాయని, ఇంకొన్ని రైళ్లను ఆలస్యంగా నడపనున్నారని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే తెలిపిన వివరాల ప్రకారం, ఈ మార్పులు సిగ్నలింగ్ వ్యవస్థను మరింత మెరుగుపరిచే పనుల్లో భాగంగా చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

