Last Updated:
GPT-6 Astra: ఇది కేవలం టెక్స్ట్ జవాబులు ఇవ్వడమే కాకుండా, కంప్యూటర్లో ఫారాలు నింపడం, CRM అప్డేట్ చేయడం, క్యాలెండర్ నిర్వహించడం, రీసెర్చ్ చేసి డాక్యుమెంట్లు రూపొందించడం, కోడ్ రాయడం, వెబ్సైట్లు తరు చేయడం వంటి పనులను స్వయంగా చేయగలదు.
ఓపెన్ఏఐ సంస్థ సెప్టెంబర్ 3, 2026న తన కొత్త ఫ్లాగ్షిప్ మోడల్ GPT-6 Astraను విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత తెలివైన, సురక్షితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌గా సంస్థ వర్ణించింది. కంప్యూటర్ వినియోగం, బ్రౌజింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, సైన్స్, వృత్తిపరమైన పనుల్లో ఇది కొత్త స్టాండర్డ్స్‌ని సృష్టించింది. ఓపెన్ఏఐ అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మాన్ దీన్ని “ఎజీఐ యుగం” ప్రారంభంగా అభివర్ణించారు.

