రోజూ ఒకే చోట నుంచి పాలు తీసుకునేవారు వాటి నాణ్యతలో వచ్చే మార్పులను గమనించడం ద్వారా కూడా అప్రమత్తంగా ఉండొచ్చు. పరిమాణం, రంగు, వాసన, రుచి, చిక్కదనంలో పదేపదే తేడాలు కనిపిస్తే సరఫరాదారుతో మాట్లాడాలి. కల్తీపై బలమైన అనుమానం ఉంటే ఇంటి చిట్కాలతోనే నిర్ణయం తీసుకోకుండా సంబంధిత ఆహార భద్రతా అధికారులను సంప్రదించి, అవసరమైతే గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. (గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది.)
