పండుగ ఖర్చులకు ప్రత్యేక బడ్జెట్ పెట్టుకోండి. షాపింగ్ మొదలుపెట్టే ముందే పండుగ ఖర్చుల కోసం ప్రత్యేక బడ్జెట్ పెట్టుకోవడం మొదటి అడుగు. రోజువారీ కిరాణా, కరెంట్ బిల్లు, ఇతర యుటిలిటీ బిల్లులు, లోన్ ఈఎంఐలు లాంటి నెలవారీ ఖర్చులతో దీన్ని కలపకండి. ముందుగా పండుగ సమయంలో వచ్చే ఖర్చుల జాబితా తయారు చేసుకోండి. వాటిని గిఫ్టులు, బట్టలు, ప్రయాణం, వేడుకలు, ఇతర ఖర్చులు అంటూ కొన్ని కేటగిరీలుగా విభజించండి. గిఫ్టుల విషయంలో ఎవరెవరికి కొనాలి, ఒక్కొక్కరికి ఎంత ఖర్చు చేయాలో ముందే నిర్ణయించుకోండి. బట్టల బడ్జెట్‌లో మీకు, కుటుంబ సభ్యులకు కొనేవి ఉండాలి. ప్రయాణ ఖర్చుల్లో టికెట్లు, ఇంధనం, హోటల్ లేదా ఇతర వసతి ఖర్చులను లెక్కలోకి తీసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
